Sandalle Sandalle

సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం ఒక వరమేరా
నను మరవని చూపులెన్నెన్నో నను నడిపిన దారులెన్నెన్నో
నను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
ముగ్గుమీద కాలు వెయ్యగానే రయ్యిమంటూ కయ్యిమన్న
ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం
భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి
ఒంటినే వెచ్చగా తాకుతోంది
తంబురాలతో చిడత పాడెనంట
గంగిరెద్దులాటలో డోలు సన్నాయంట
పెద్ద పండగొచ్చెనోయంటూ ముస్తాబుఅయ్యింది చూడరా, ఊరు ఇచ్చటా
ఇంటిగడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి
రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికీ
మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం ఒక వరమేరా, ఓ ఓఓ
దెబ్బలాటలోన ఓడిపోతే కోడిపుంజు పొయ్యి మీద
కూరలాగా తాను మాడిపోదా పాపం
నేల మీది నుండి గాలిపటం నింగి దాకా
దారమే తోకగా ఎగురుతుంది
ఎడ్ల బండిపై ఎక్కు చిన్నా పెద్దా
గోలగోల చెయ్యడం ఎంత బాగుందంట
రోజు మారిపోయినాగాని తగ్గేది లేదంటా అంతటా సంబరాలే
విందు భోజనాలు చేసి రావడానికి
నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి
అంతమందినొక్కసారి కలవడానికి చాలవంట మూడు రోజులు
మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం ఒక వరమేరా, ఆ ఆఆ
మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం ఒక వరమేరా, ఓ ఓఓ
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే



Credits
Writer(s): Sanapati Bharadwaj Patrudu, Jain Vishal Lalit
Lyrics powered by www.musixmatch.com

Link