Entha Entha Choosinaa (From "Gamanam")

ఎంత ఎంత చూసిన
చాలదే ఈ మనసున ओ मेरी जान
ఎంత ఎంత వేచిన
రాకతోనే తీరెనా ఈ వేదన
మాటల్లో కూడా తెలుపలేవా
పరదాలు తీసి తెగించలేను
कहून मे क्या
ये प्यार मे जो मेरा हाल
ఎంత ఎంత చూసిన
చాలదే ఈ మనసున ओ मेरी जान

తాను కాస్త ముందుకొస్తే
ఆగిపోయే ఊపిరే
కానరాని వేళలోన ఉండలేదులే
ఓరకంట చూడగానే మేలుకోవా ఊహలే
పెదవి దాటి రానే రావు
మనసు మాటలే
ముందు లేని అల్లరేదో
కమ్ముకున్న వైఖరి
ఒంటరన్న మాటకింకా ఆఖరే కదా
ఎక్కడున్నా ఒక్కసారి పెరిగిపోవు అలజడి
దోర నవ్వు సోకగానే కలత తీరదా
कहून मे क्या
ये प्यार मे जो मेरा हाल
ఎంత ఎంత చూసిన
చాలదే ఈ మనసున ओ मेरी जान

ఇన్నినాళ్ళు గుండెలోన జాడలేని హాయిది
నీడ కూడ రంగు మారే
ప్రాయమే ఇది
దేనినైనా దాటిపోయే వేగమేమో వయసుది
తరుముతున్న ఆపలేని అదుపు లేనిది
రెప్పపాటు కాలమైనా ఆగలేని జోరిది
చూడగానే నేల మీద తేలిపోయెనా
నువ్వు వేరు నేను వేరు
అసలు కాని చోటిది
ఇద్దరింక ఒకటిగానే కలిసేతనమిది
दुबादिया बूरी तरह ये कैसा प्यार
ఎంత ఎంత చూసిన
చాలదే ఈ మనసున ओ मेरी जान
ఎంత ఎంత వేచిన
రాకతోనే తీరేనా ఈ వేదన
మాటల్లో కూడా తెలుపలేను
పరదాలు తీసి తెగించలేను
कहून मे क्या
ये प्यार मे जो मेरा हाल

ఎంత ఎంత చూసిన
చాలదే ఈ మనసున ओ मेरी जान



Credits
Writer(s): Ilaiyaraaja, Krishna Kanth
Lyrics powered by www.musixmatch.com

Link