Kadhulu Kadhulu

కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు
కాలం తన కళ్ళు తెరచి గాలిస్తున్నది నీలో
కాలిక ఏమైందని ఉగ్ర జ్వాలిక ఏమైందని
దెబ్బకొడితే పులి నేను ఆడదాన్నటుందా
తోక తొక్కితే నాగు తనను ఆడదనుకుంటుందా

కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు

గాజుతో గాయాలు చెయ్
చున్నీనే ఉరి తాడు చెయ్
రంగులు పెట్టే గొళ్లనే గుచ్చే బాకులు చెయ్
పిరికితనం ఆవహించి పరిగెత్తే నీ కాళ్లతో
రెండు తొడల మధ్య తన్ని నరకం పరిచయం చెయ్
నీ శరీరమే నీకు ఆయుధ కర్మాగారం
బతుకు సమారా భూమిలో
నీకు నీవే సైన్యం సైన్యం సైన్యం

కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు



Credits
Writer(s): Suddala Ashok Teja, Thaman S
Lyrics powered by www.musixmatch.com

Link