Vennellana

వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
మంచైనా మల్లెలు చల్లినా
నీ ముడుపులే చెల్లించనా
ఇలా ఈ క్షణం
ఆపనీ యవ్వనం హాయిగా
కలే తీరని ఆకలే తీర్చని
ఒకే కోరికా

వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
ఆరాటం ఆవురన్నా మోమాటం ఆపుతోంది
అయినా నీ చేతివాటం
తనువంతా తాకుతోంది
నీ ఊపిరి కాగడాలకే ఈడంటుతున్నదా
నీ అల్లరి ఆగడాలకది చల్లారదా
ఆ సంగతే ఆశరేపిందా హాయ్ హాయ్

వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
నీ ఒక్కడి వల్లనేగా
ఈ వత్తిడి కాచుకున్నా
ఆ ఒంపులు కోసమేగా
నీ వెంబడి సాగుతున్నా
నా కౌగిలి తాయిలాలనే
కాసింక ఇవ్వనా
నీ సొగసుల శోభనాలనే కానివ్వనా
నీ చూపుకే వాడిపోతున్నా

వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
మంచైనా మల్లెలు చల్లినా
నీ ముడుపులే చెల్లించనా
ఇలా ఈ క్షణం
ఆపనీ యవ్వనం హాయిగా
కలే తీరని ఆకలే తీర్చని
ఒకే కోరికా



Credits
Writer(s): Vanamaali, S. Chinna
Lyrics powered by www.musixmatch.com

Link