Chakravarthiki Veedi (From "Money")

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది money, money
అమ్మ చుట్టమూ కాదు
అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది money, money
పచ్చనోటుతో life-u లక్ష link-uలు
పెట్టుకుంటుందని అంది money, money
పుట్టడానికీ పాడె కట్టడానికి
మధ్య అంతా తనే అంది money, money
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది money, money
తైలం తమాష చూద్దాం పదండి అంది money, money
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని love ఆడి కట్టుకోరా

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతాననీ అంది money, money
అమ్మ చుట్టమూ కాదు
అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది money, money

ఇంటద్దె కట్టావా నా తండ్రి, no entry వీధి వాకిట్లో
దొంగల్లే దూరాలి silentలి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పదా brother money వేటకీ
అప్పుకే పదా brother ప్రతీ పూటకీ
रोटी कपडा room-u అన్నీ Rupee రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని love ఆడి కట్టుకోరా

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతాననీ అంది money, money
అమ్మ చుట్టమూ కాదు
అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది money, money

ప్రేమించుకోవచ్చు దర్జాగా pictureలో పేద heroలా
Dreamఇంచుకోవచ్చు ధీమాగా dramaలో ప్రేమ storyలా
Park-uలో కనే కలే ఖరీదైనదీ
Black-uలో కొనే వెలే cini ప్రేమదీ
చూపించరుగా free show వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతి నిమిషమూ సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మిని love ఆడి కట్టుకోరా

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది money, money
అమ్మ చుట్టమూ కాదు
అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది money, money
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది money, money
తైలం తమాష చూద్దాం పదండి అంది money, money
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని love ఆడి కట్టుకోరా
డబ్బురా డబ్బుడబ్బురా
డబ్బు డబ్బే డబ్బు డబ్బురా



Credits
Writer(s): Sirivennala Seetharama Shastry, Sri Maruthi
Lyrics powered by www.musixmatch.com

Link