Manasa Vinava

ఊహలకందని వెన్నెల చూసా నీ వల్లేగా
ఆశకి రెక్కలు కట్టుకు ఎగిరా ఆనందంగా
కలలే చెరిపి వదిలేశావా నను ఒంటరిగా
ఎందుకే ఇలా, ఇలా

హాయిని కొంచెం చవిచూపించి తరిమేసావా
వెలుతురునంతా నీతో తీసుకువెళ్తున్నావా
ఎప్పటిలాగే కన్నుల ముందర చీకటితోవా
ఎందుకే ఇలా, ఇలా

నువ్వాడే ప్రతిమాట నిజమేనని నమ్మేశా
ఏమార్చావందంగా మనసే
కళ్ళారా చూసాక కాదనుకోమంటావా
తెరిపించావీరోజే కనులే
తెచ్చి పోసుకుంటూ నీ చుట్టూ చీకటినీ
వెన్నెలేది అంటూ అడగొద్ధే రాతిరినీ
నీ చేతులతో నిన్నే నువ్వు చెరిపేసాక
నన్నంటే ఎలా, ఎలా

కనిపించని నిజమైనా దాచాలనుకున్నానా
ముసుగేసి కప్పిందీ భయమే
నిను చూసిన ప్రతిసారి అది నాకు తొలిసారే
ఆ క్షణమే దాచిందీ నిజమే
కంటిపాపతోనే కనురెప్పే తలపడితే
అంతకన్నా వేరే అన్యాయం ఉండదులే
చెక్కిలి తాకని ఒక తడి గీతం వినబడలేదా

మనసా మనసా
(మనసా వినవా)
వినవా వినవా
నా మదిలో మాటే వినవా
(మనసా వినవా)
ఓ మనసా మనసా
(మనసా వినవా)
వినవా వినవా
(మనసా వినవా)
నా మదిలో మాటే వినవా
(మనసా వినవా)
(మనసా వినవా)
మనసా
(మనసా వినవా వినవా)
వినవా
వినవా



Credits
Writer(s): Shakthikanth Karthick
Lyrics powered by www.musixmatch.com

Link