Gaana of Republic (From "Republic")

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
నా ప్రాణంలోని ప్రాణం
నా దేహంలోని దాహం
నా మౌనం పాడే గానం
నా ప్రశ్న సమాధానం
అది అందమైన అందరాని కన్నెరా
లక్ష అక్షరాలు రాయలేని కవితరా
ఈ ప్రపంచమే కోరుకునే అతివరా
పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్చరా
నా కళ్ళలోన రంగుల కలరా
నా కళ్ళలోన రంగుల కలరా
నా ఊహలకే ఉనికే తనురా
నా బ్రతుకులోనా భాగం కదరా
నా ఊపిరికే అర్థం తనురా

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో

తెల్లవాడి నెదిరించి నల్లని
చీకట్ల నుంచి
పిల్లను విడిపించి తెచ్చి
సంబరాలు చేసుకుంటే
అంతలోనే తెలిసిందని మాయమైపోయిందని
ముందుకన్నా ముప్పువున్న
పంజరానా ఉన్నదని
అసలెక్కడుందో తెలియకుంది చూడరా
అది లేక మనిషికింకా విలువేదిరా
ఏ పోరాటంతో దానిని చేరాలిరా
ఏ ఆయుధంతో దానిని గెలవాలిరా

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో

అనాదిగా ఎవడో ఒకడు
అది నాకే సొంతమంటూ
నియంతలై నిరంతరం చెరలో బంధించినారు
రెక్కలని విరిచేసి హద్దులనే చెరిపేసి
అడిగే ప్రతి ఒక్కడిని
అణిచి అణిచి వేసినారు
నరజాతి చరిత్రలో నలిగిపోయెరా
చల్లారని స్వాతంత్ర కాంక్ష స్వేచ్చరా
నరనరాల్లోనా ప్రవహించే ఆర్తిరా
కనిపించకనే నడిపించే కాంతిరా

ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో
ఏయ్ రారో ఏయ్ రో



Credits
Writer(s): Manisharma, Rahman
Lyrics powered by www.musixmatch.com

Link