Dhimsare - From "Aakashavani"

ఏంద్రా అట్టా ఏలాడపోత కూసుంటారు
అవ్తల ఏల అవట్లా
లెగండెహె
జాత్రంటె ఎట్లుండాల
జమజమలాడి పోవాలా మళ్ళా, ఎయ్

డప్పులెయ్ రో గిద్దడో
దరువులెయ్ రో బిడ్డడో
ఎయ్ సిన్నా పెద్దా సిందేలా
సుక్కలెయ్ రో సుబ్బడో
సురకలెయ్ రో అబ్బడో
ఎయ్ కొండా కోన ఊగేల
గూడెంలో కోడి కూతెయ్యాల
గుండెల్లో లేడీ లేచేల
గుళ్ళోన సామి తోడియ్యాల
గుడిసెల్లో దీపాలెలిగేలా

(ఏ ధింసారే ధింసారే యారే యారే
ధింసారే ధింసా ధింసా
ధింసారే ధింసారే యారే యారే
ధింసారే ధింసా ధింసా)

ఆ, రంగులెయ్ రో రంగడో
రచ్చసెయ్ రో సింగడో
ఏ, నింగినేల కలిసేలా
ముక్కలెయ్ రో మెల్లడో
ములకలెయ్ రో పిల్లడో
ఎయ్, వాగూవంకా పొంగేలా
గూడెంలో కోడి కూతెయ్యాల
గుండెల్లో లేడీ లేచేల
గుళ్ళోన సామి తోడియాల
గుడిసెల్లో దీపాలెలిగేలా

ఏ, సామీ సామీ
ఏ పుణ్యం సేసామో ఈ మన్నెం నీదాయె
నా ఇల్లు నా గూడు అంతా నీ నీడాయే
సంటోడి పాణాలే నిలిసాయంటే నీ మాయే

పలికే దైవం ముందుంటే పల్లేదైనా మల్లేరా
కాచే దైవం ఎంటుంటే కాలం నీదేరా

మానైనా మడిసై మాటాడాలా
మా సెంత సేరి ఊగేలా
వానైనా వరసై ఆటాడాలా
మా సింతలన్నీ తీరేలా

(ఏ ధింసారే ధింసారే యారే యారే
ధింసారే ధింసా ధింసా
ధింసారే ధింసారే యారే యారే
ధింసారే ధింసా ధింసా
ఏ ధింసారే ధింసారే ధింసారే ధింసారే
ధింసారే ధింసారే ధింసారే ధింసారే
ధింసారే ధింసారే ధింసారే ధింసారే, ధింసా ధింసా)



Credits
Writer(s): Anantha Sriram, Kaala Bhairava
Lyrics powered by www.musixmatch.com

Link