Balamevvadu Title Song (From "Balamevvadu")

బలమెవ్వడు కరిబ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను కావన్
బలమెవ్వడు సుగ్రీవునకు
బలమెవ్వడు నాకు నీవే బలమౌ కృష్ణా

మకరినోట చిక్కినకరి మొఱను ఆలింపగా
పరుగునపడి వచ్చితివట పైటచెంగు వీడక
పాపపుపొలిమేరవరకు పరధ్యానమైనా
పండినవేళకు పొడిచే చిన్నగాలివాన
నిండాస్తుతి చేయువరకు నిదానించనేల
ఎంత గొంతు ఎత్తాలి నువ్వు తరలిరాగా
బలమెవ్వడు
బలమెవ్వడు
బలమెవ్వడు

సమర్థగణాలు శిఖస్తుపడగా
విశాల ఉషస్సు ప్రహరమవగా
కృష్ణా నను బ్రోవమన్న కృష్ణను కాపాడగా
బలిసిన చీకటి వలిచేటందుకు
కన్నులు ఉండగా కత్తులు ఎందుకు
తెగింపు లిఖించు ముగింపు ప్రతికథరా
బలమెవ్వడు
బలమెవ్వడు

చెరపట్టిన వాలికథకు చరమగీతి పాడగా
చెట్టుచాటు చేసుకున్న చక్రధారి నీవుగా
పాపపుఫణి కోరలూడ శుక్రనీతి వాడగా
మాన్యుడు సామాన్యుడుగా బలమునిచ్చినావుగా
ఎంతటి బలవంతుడైన నీతిచేత ఓడుగా

వేషమేదైనా దోషనాశనానికే
ఆవేశం ఏదైనా అనర్థవిధ్వంసానికే
ఎదురయ్యే ప్రతికష్టం బలం పెరగడానికే
మొదలయ్యే ప్రతీ మోసం ముగిసిపోడానికే
తిరుగుబాటు పాటకు ప్రేమే సాహిత్యమనీ
కీడుచేసే కీడలన్ని కాడలతో నరకమని
అసహాయపు ఆక్రోశం అగ్నిలాగ కురవనీ
బలహీనతకాదు ప్రేమ బలమంటూ తెలపనీ



Credits
Writer(s): Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link