Shivaratri Song 2020

ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర
ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర
జగమంతా నీదే కదరా జంగమా
జనమందరు పూజించే శివలింగమా

అర్థమవని ఆధిభిక్షు అవతారమా
ఆచరించి తెలిపే జీవిత సారమా
నాగు పాము నీ మెడలోన హారమా
నరులనెపుడు గాచే చెడు సంహారమా
తలన గంగ ఉన్నా
తీరని దాహమా
జోలె పట్టి తిరగడము నీకవసరమా
నిండు నలుపు రూపమా
నిజాలేంటో చూపుమా
జంతు చర్మ దేహమా
అంతులేని సందేహమా
అర్థమవని ఆధిభిక్షు అవతారమా
ఆచరించి తెలిపే జీవిత సారమా
జగమంతా నీదే కదరా జంగమా
జనమందరు పూజించే శివలింగమా
ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర
ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర

పార్వతి సగభాగమై గణనాథుడి
పునాది పుట్టుకవై
వెలిగే నీకెందుకో ఆ స్మశాన సంచారం
కుభేరునికే వరములు కుమ్మరించి
అష్టసిద్ద నిధులు
నువ్వేమో భిక్షాటన అసలేంటి
ఈ మర్మం
విశ్వమంత నీ భక్త జనమే
వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే
అయినా నీకు ఇల్లు లేదట
ఎంతటి హాస్యమే
నీ మాట దాటి చిన చీమ కూడ
కాటెయ్యదుగా ఓ పరమేశ
ఓ చిటికేసి తీర్చేయ్యరాద
మా అందరి హరిగోస
నిలకడంటూ లేని నిత్య ప్రయాణమా
నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా
అర్థమవని ఆధిభిక్షు అవతారమా
ఆచరించి తెలిపే జీవిత సారమా

ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర
ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర

నటరాజ స్వరూపమా పంచభూతములన్నీ
నీ వశమా
చావు పుట్టుకలనే మించినది
నీ మహిమ
కైలాసం వీడవా కాస్తైనా
చూడు జనము గొడవ
అనుమానం తీర్చవా నువు
మనిషా దేవుడివా
నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు
బంగారాలే నిలువెల్లా
నీకు మాత్రము సిత్రంగా
ఒళ్ళంతా బూడిదేల
ఒకయేడు కాదు రెండేళ్లు కాదు
ప్రతియేడు ఇంతే మా ప్రేమా
నిను సుట్టవోలే ఎంతనుకున్నా
ఏ గుట్టు విప్పవేల
ఒక్కపొద్దు జాగారాలకు ధీటుగా
సక్కదిద్దు మా బతుకులనే తేటగా
కోటి పేర్లు నీకున్నా అలవాటుగా
శంకరయ్య అంటే పలుకు ప్రేమగా
జగమంతా నీదే కదరా జంగమా
జనమందరు పూజించే శివలింగమా
నాగు పాము నీ మెడలోన హారమా
నరులనెపుడు గాచే చెడు సంహారమా
అర్థమవని ఆధిభిక్షు అవతారమా
ఆచరించి తెలిపే జీవిత సారమా
తలన గంగ ఉన్నా తీరని దాహమా
జోలె పట్టి తిరగడము నీకవసరమా

ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర
ఓం హరోమ్ హర ఓం హరోమ్ హర



Credits
Writer(s): Charan Arjun
Lyrics powered by www.musixmatch.com

Link