Laire Lallaire

వలపులొలుకుతున్నయే వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే సింగారాలు
వలపులొలుకుతున్నయే వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే సింగారాలు

చీరకట్టులోన ముద్ద మందారాలు
చీరకట్టులోన ముద్ద మందారాలు
ముగ్దులైయేపోయేనమ్మా చూసే కళ్ళు
వలపులొలుకుతున్నయే వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే సింగారాలు

లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే

సింగిడిని తొలచి రంగు
చీరలుగా మలిచి
బంగారు మేనికి సొగసులద్దుకున్నరే
హంగులు దిద్దుకున్నరే
సీతకోకచిలుకలు ఆ చిన్ని
లేడి పిల్లలు
అందాల బామలయ్యి కనువిందు చేసిరే
ముస్తాబు చూడరే
కంచిపట్టు చీర కట్టి కన్నెపిల్లలు
అర్రే కంచిపట్టు చీర కట్టి కన్నెపిల్లలు
అబ్బా ఆడనెమలి తీరు ఆటలాడుతున్నరూ
వలపులొలుకుతున్నయే వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే సింగారాలు
వలపులొలుకుతున్నయే వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే సింగారాలు

లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే

పుట్టింటా పట్టుచీర మెట్టినింటా అడుగుపెట్టి
నట్టింటా తిరుగుతుంటే సందడులాయే
తియ్యని సంబురమాయే
ముగ్ధా చీరాల చాటున
దాగిన ముచ్చటలెన్నో
చిరునవ్వుల తెరచాటున మదినే దోచే
మనసైనోళ్ళను గెలిచే
జాబిలమ్మలు జాజి పూలకొమ్మలు
జాబిలమ్మలు జాజి పూలకొమ్మలు
అందాలు ఆరబోసుకున్న సుందరాంగులు
వలపులొలుకుతున్నయే వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే సింగారాలు
వలపులొలుకుతున్నయే వయ్యారాలు
సిగ్గులొలుకుతున్నయే సింగారాలు

లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే
లాయిరే లాయిరే లల్లాయి లాయి లాయిరే



Credits
Writer(s): Thirupathi Matla, Madeen Sk
Lyrics powered by www.musixmatch.com

Link