Alasina Sanchari (From "Nootokka Jillala Andagadu")

ఓ అలసిన సంచారి
పరుగులు ఏ దారి
నిలబడు ఓసారి
ఈ బతుకను బారాసి
అలజడి రాజేసి
అడుగిడె నీకేసి

నీ కలలను కాజేసి
చెలిమినే కొలిమిలో తోసేసి
నీ తలపున మాటేసి
లోలో వెలుతురు తోడేసి

ముసిరెనే తిమరపు రాకాసి
అవహేళన చేసి
కలతల సావాసి
ముసిరెనే తిమరపు రాకాసి
అవహేళన చేసి
కలతల సావాసి

హే, తన ఉనికే వదులుకొని
కలగాపులగం దిశగా
నటనలతో గడిపేనిలా
బిడియం వలచి
ముసుగొకటి తొడుగుకొని
కుహనాగతినే నడవగా
సహచరినే ఎడమయ
కాజేసిన పనికి

ఏ పరిహారం కోరనుందో బాటసారి
వలయం నీది
నీ లోపాలే అద్దమల్లె ఎత్తి చూపే
ఈ నడిచే దారి

ఎరుగవే అలసిన సంచారి
పరుగులు ఏ దారి
నిలబడు ఓ సారి
ఎరుగవే అలసిన సంచారి
పరుగులు ఏ దారి
నిలబడు ఓ సారి

సమయమే ఈ గమనములో
అలుపు గెలుపు జతపడి
పడగొడుతూ నిలబెడితే
అది ఓకేలే
తలచనిదే జరిగినదో
వెరవే వదిలి నిలబడి
నిలకడగా అడుగిడుతూ
నువు నడవాలి

నీ మదిలోకి తొంగి చూడు
కానవచ్చే నీ సిసలు లోటు
ఈ పయణాన ఆటుపోటు దాటుకుంటూ
నీ తీరం మీటు

సడలకో అలసిన సంచారి
పరుగులు ఏ దారి
నిలబడు ఓ సారి
సడలకో అలసిన సంచారి
పరుగులు ఏ దారి
నిలబడు ఓ సారి



Credits
Writer(s): Shakthikanth Karthick
Lyrics powered by www.musixmatch.com

Link