Mana Manasune

నాతో నేనే ఉన్నా
నీతో పాటే ఊహల్లోన
తారా తీరం దాకా
గాల్లో తేలి పోతున్నా

నీతో నేనే ఉంటే
కానరాదే చుట్టూ లోకం
నిన్నే చూస్తూ ఉంటే
చాలదింకా ఏ కాలం...

ఓ... నీకు అభి అభిమానిలే...
హో హో... నీకే శశి వశమైందిలే... ఓ...

మన మనసునే
ప్రేమ ముదిరెనే
మది మురిసెనే... ఓ.ఓ!

విధి చెరపని
జంట మనమని
ఎద ఎగిరినే... ఓ.ఓ!

నాలో దాగి ఉన్న
ప్రేమ ఎంత ఉన్న
నీలో ఉన్న నన్ను దాటేనా

కళ్ళు మూసే దాకా
ఒళ్ళో దాచుకోనా
ముళ్ల దారులెన్నో దాటైనా

నీచెలి నీ చెంతే
హత్తుకు చేరిందే...
వంతుకు ఇంకొంత నీ దూరం దూరం పోనీ

ముద్దుగా నీ వేళ్ళే
ఆ మూడు ముళ్లేసే
వేడుక తీరే రో'జే రానీ వేగంగా...

మన మనసునే
ప్రేమ ముదిరెనే
మది మురిసెనే... ఓ.ఓ!

విధి చెరపని
జంట మనమని
ఎద ఎగిరినే... ఓ.ఓ!



Credits
Writer(s): Marcus M, Maschendra M
Lyrics powered by www.musixmatch.com

Link