Neeve (feat. Chandrakanth, Sri Datta & Srilakshmi Satyanarayan)

నను నేనే మరచేలే
నీ పేరే తలచేలే
ఎటు ఉన్నా నీ ఊహే
ఎదురయ్యి పోలేవేం

కనుపాపైనా విడలేని
చిరుజాబిలి రూపం
నీవే. నీవే.
ప్రతి నిమిషం నీకై వేచి
కాలాన్నే కాల్చేస్తాలే
నేనే.

ఎదలోనీ సడి నీవే
మదిలోని జ్వలినీదే
ఎదురైతే సరిపోదే
వచ్చేవా. నాలొకే.

నడిసంద్రాన్నే ముంచేటి
ఎనలేని ప్రేమే నీవే
నీవే.
ఆకాశాన్నే మించేటి
సహనంతో ప్రేమిస్తాలే
నేనే.

అవకాశం లేకున్నా
నీకోసం చూస్తున్నా
ఎడబాటే ఎదురైనా
నీ గమ్యం నేనవనా

గడిచే సమయం నన్నీలా
విధిగదిలో బందిస్తున్నా
ఉన్నా.
నా ఎదలో నీ స్మృతులన్నీ
వెలుగుల్ని వెదజల్లేనా
చల్లేనా.



Credits
Writer(s): Chandrakanth Pechetti, Sai Ganesh Veeravalli, Sri Datta Topella
Lyrics powered by www.musixmatch.com

Link