Neeli Neelakantuda

నల్లా నల్లాని కొప్పున
సల్లని గంగను
దాసుకున్న నీలికంఠుడా
తెల్ల తెల్లాని సిరిసిరి
ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా ఆ ఆ ఆ

ఒంటినిండా బూడిదున్న
కంటినిండా నిప్పులున్న
అందమైన మాలలల్లి కొండబిడ్డ
గౌరి తల్లి
కోరికోరి నిన్ను చేరి
అర్ధనారి అయ్యే వేళ
రారా శివయ్యా ఆఆ ఆ
దండాలయ్యా అభిషేకాలయ్యా
ఓహో ఓఓఓ మా లింగమయ్యా ఆఆ ఆ
దండాలయ్యా అభిషేకాలయ్యా

నల్లా నల్లాని కొప్పున
సల్లని గంగను
దాసుకున్న నీలి కంఠుడా
తెల్ల తెల్లాని సిరిసిరి
ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా ఆ ఆ ఆ

మూడు కన్నులవాడ
మూడు శూలాల వాడ
మూడు లోకాలనేలే సాంబయ్యా
(మూడు కన్నులవాడ)
(మూడు శూలాల వాడ)
(మూడు లోకాలనేలే సాంబయ్యా)
మారేడు ఆకులిస్తే మాతోడు
నువ్వు ఉండి
మాగోడు తీర్చుతావు మా అయ్యా
(మారేడు ఆకులిస్తే మాతోడు)
(నువ్వు ఉండి)
(మాగోడు తీర్చుతావు మా అయ్యా)
దోసెడన్ని నీళ్లు చల్లితే
బోలెడంత పొంగుతావు శంకరా
పాలధారలల్ల పోస్తే
పిల్లాపాపలిస్తవంట ఈశ్వరా
రుద్రుడా వీర భద్రుడా
కాలుడా భక్త లోలుడా
పంచాక్షరాల స్వామి పంచామృతాల లోన
పంచదార కలిసినట్టు పంచవయ్య
నీదు ప్రేమ
నల్లా నల్లాని కొప్పున
సల్లని గంగను
దాసుకున్న నీలి కంఠుడా
తెల్లా తెల్లాని సిరిసిరి
ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా ఆ ఆ ఆ

సూర్య లింగము నీవు
చంద్ర లింగము నీవు
వాయు లింగము నీవు పరమేశా
(సూర్య లింగము నీవు)
(చంద్ర లింగము నీవు)
(వాయు లింగము నీవే పరమేశా)
పృథ్వీ లింగము నీవు
జల లింగము నీవు
తేజో లింగము నీవు జగదీశా
(పృథ్వీ లింగము నీవు)
(జల లింగము నీవు)
(తేజో లింగము నీవే జగదీశా)
ఎండికొండల వాసివే నీకు
ఏకాదశ రుద్రమే
నందివాహనం ఎక్కిరా
గమకచమకాలు నీకు ఇష్టమే
దేవుడా ఆది దేవుడా
అరుణాకోనె నాధుడా
బిచ్చమెత్తే సామి నీవు
అచ్చమైన మనసుతోటి
స్వచ్చమైన జీవితాన్ని ఇచ్చిపోవా జంగమయ్
నల్లా నల్లాని కొప్పున
సల్లని గంగను
దాసుకున్న నీలి కంఠుడా
తెల్లా తెల్లాని సిరిసిరి
ఎన్నెల వంకను
ఎత్తుకున్న శివశంభుడా ఆ ఆ ఆ
ఒంటినిండా బూడిదున్న
కంటినిండా నిప్పులున్న
అందమైన మాలలల్లి కొండబిడ్డ
గౌరి తల్లి
కోరికోరి నిన్ను చేరి
అర్ధనారి అయ్యే వేళ

రారా శివయ్యా ఆఆ ఆ
దండాలయ్యా (దండాలయ్యా)
అభిషేకాలయ్యా (అభిషేకాలయ్యా)
మా లింగమయ్యా (మా లింగమయ్యా)
దండాలయ్యా (దండాలయ్యా)
అభిషేకాలయ్యా (అభిషేకాలయ్యా)
దండాలయ్యా (దండాలయ్యా)
(అభిషేకాలయ్యా)



Credits
Writer(s): Kasarla Shyam, Madeen Sk
Lyrics powered by www.musixmatch.com

Link