Rangulalokamlo

రంగుల లోకంలో బంధీవైయున్నా
ఎదలో బాధను పెదవుల నవ్వును కలిగి ఉన్నా
ప్రేమను పంచే ఓ తోడే లేకున్నా
యాంత్రికమైన బ్రతుకుల నడుమ బంధీవైనా

రంగుల లోకంలో బంధీవైయున్నా
ఎదలో బాధను పెదవుల నవ్వును కలిగి ఉన్నా
ప్రేమను పంచే ఓ తోడే లేకున్నా
యాంత్రికమైన బ్రతుకుల నడుమ బంధీవైనా

యేసు రమ్మనుచున్నాడు
యేసు రమ్మనుచున్నాడు
యేసు రమ్మనుచున్నాడు తన యొద్దకు

ప్రాణము పెట్టియున్నాడు
ప్రేమను చాటి యున్నాడు
పరమున చేర్చగనున్నాడు
మన ప్రభుయేసు

మోస పూరితం ఈ లోక భోగాలు
నిత్యము నిలవవు నీకున్న భాగ్యాలు
తెలుసుకో ఓ నేస్తమా

అన్ని ఉంటే నిన్ను అందల మెక్కించి
లేని నాడు నడివీధిలో నెట్టేసే
మనుషులా ప్రేమలు నిలుచునా

మోస పూరితం ఈ లోక భోగాలు
నిత్యము నిలవవు నీకున్న భాగ్యాలు
తెలుసుకో ఓ నేస్తమా

అన్ని ఉంటే నిన్ను అందల మెక్కించి
లేని నాడు నడివీధిలో నెట్టేసే
మనుషులా ప్రేమలు నిలుచునా

నిను నిన్నుగా ప్రేమించినా
శ్రీ యేసు ప్రేమయే సత్యము
కరుణించును కాపాడును
నీ వెంట నిలుచును నిత్యము

నిను నిన్నుగా ప్రేమించినా
శ్రీ యేసు ప్రేమయే సత్యము
కరుణించును కాపాడును
నీ వెంట నిలుచును నిత్యము

యేసు రమ్మనుచున్నాడు
యేసు రమ్మనుచున్నాడు
యేసు రమ్మనుచున్నాడు తన యొద్దకు

ప్రాణము పెట్టియున్నాడు
ప్రేమను చాటి యున్నాడు
పరమున చేర్చగనున్నాడు
మన ప్రభుయేసు

నీది అన్నది ఏది లేదు
నీకున్నది నీతో రాదు
ఒంటరై భువిని విడువవా?

పాపము నిండిన బ్రతుకులతో నీవు
పావన లోకం చేరలేవుగా
నరకమే నీ తుది తీరమా

నీది అన్నది ఏది లేదు
నీకున్నది నీతో రాదు
ఒంటరై భువిని విడువవా?

పాపము నిండిన బ్రతుకులతో నీవు
పావన లోకం చేరలేవుగా
నరకమే నీ తుది తీరమా

ప్రతి పాపము ప్రతి శాపము
తొలగించును యేసు రక్తము
నిత్య జీవమే అందించగా
మరణించిగెలిచే ప్రభు సత్యము

ప్రతి పాపము ప్రతి శాపము
తొలగించును యేసు రక్తము
నిత్య జీవమే అందించగా
మరణించిగెలిచే ప్రభు సత్యము

యేసు రమ్మనుచున్నాడు
యేసు రమ్మనుచున్నాడు
యేసు రమ్మనుచున్నాడు తన యొద్దకు

ప్రాణము పెట్టియున్నాడు
ప్రేమను చాటి యున్నాడు
పరమున చేర్చగనున్నాడు
మన ప్రభుయేసు

రంగుల లోకంలో బంధీవైయున్నా
ఎదలో బాధను పెదవుల నవ్వును కలిగి ఉన్నా
ప్రేమను పంచే ఓ తోడే లేకున్నా
యాంత్రికమైన బ్రతుకుల నడుమ బంధీవైనా

రంగుల లోకంలో బంధీవైయున్నా
ఎదలో బాధను పెదవుల నవ్వును కలిగి ఉన్నా
ప్రేమను పంచే ఓ తోడే లేకున్నా
యాంత్రికమైన బ్రతుకుల నడుమ బంధీవైనా

యేసు రమ్మనుచున్నాడు
యేసు రమ్మనుచున్నాడు
యేసు రమ్మనుచున్నాడు తన యొద్దకు

ప్రాణము పెట్టియున్నాడు
ప్రేమను చాటి యున్నాడు
పరమున చేర్చగనున్నాడు
మన ప్రభుయేసు



Credits
Writer(s): Arun Nakrekanti
Lyrics powered by www.musixmatch.com

Link