Yemaiundacho

ఏమైందో ఏమోగానీ ఏపుడూలేని ఈ మనసే
చిరునామా లేనేలేని లేఖలేవో రాసే
ఏమైందో ఏమోగానీ ఎపుడూలేదే ఈ వరసే
ఏ గమ్యం లేనేలేని అడుగులేవో వేసే

క్షణమైనా కుదురుండలేని కొత్త దోబూచులాటే ఇది
ఎవరైనా గమనించలేని మూడు హృదయాల గొడవే ఇది
రెక్కలు ఉండి ఎగిరెళ్ళలేని చిక్కులు పడ్డ ఓ పిట్ట కథిది

ఏమైందో ఏమోగానీ ఏపుడూలేని ఈ మనసే
చిరునామా లేనేలేని లేఖలేవో రాసే
ఏమైందో ఏమోగానీ ఎపుడూలేదే ఈ వరసే
ఏ గమ్యం లేనేలేని అడుగులేవో వేసే

ప్రేమ అనచ్చో పిచ్చి అనచ్చో
మైకమనచ్చో మాయ అనచ్చో
బాధ అనచ్చో బెంగ అనచ్చో
ఇంకేమనచ్చో ఏమై ఉండచ్చో

నీ చిన్నిగుండెలో ఉన్నదేమిటో
చెప్పనివ్వదే దాచనివ్వదే
నీ చిన్నిప్రాణమే చిత్రహింసలో
ఊగుతున్నదే

నీ చిన్నిఆశకి తీరమెక్కడో
దారితోచదే దిక్కుతోచదే
నీ చిన్నిజన్మకి అర్థమేమిటో
అర్థమవ్వదే

తొంగిచూడ్డాలు పొంగిపోడాలు
ఏవీ లేకుండా ఎన్నాళ్ళో
కొంటెభావాలు కూనిరాగాలు
బయటపడకుండా ఎన్నేళ్ళో

ఈ కలలే ఉప్పొంగే సంద్రాలే
తప్పుకోలేక ఎన్నెన్ని గండాలే
మనసంతా గందరగోళాలే
చెప్పుకోలేని నిప్పులగుండాలే

ప్రేమ అనచ్చో పిచ్చి అనచ్చో
మైకమనచ్చో మాయ అనచ్చో
బాధ అనచ్చో బెంగ అనచ్చో
ఇంకేమనచ్చో ప్రేమై ఉండచ్చో

ఏమైందో ఏమోగానీ ఏపుడూలేని ఈ మనసే
చిరునామా లేనేలేని లేఖలేవో రాసే
ఏమైందో ఏమోగానీ ఎపుడూలేదే ఈ వరసే
ఏ గమ్యం లేనేలేని అడుగులేవో వేసే

అడుగంత దూరాన ఉన్నా
అందుకోలేని తీరేమిటో
ఎంతెంత దగ్గరగా ఉన్నా
దగ్గరవలేని స్థితి ఏమిటో

గుప్పెడు గుండె చప్పుళ్ళ తగువా
తీర్చడమంటే అది అంత సులువా

ప్రేమ అనచ్చో పిచ్చి అనచ్చో
మైకమనచ్చో మాయ అనచ్చో
బాధ అనచ్చో బెంగ అనచ్చో
ఇంకేమనచ్చో ఏమై ఉండచ్చో



Credits
Writer(s): G Devi Sri Prasad, Banisetti Suresh Kumar
Lyrics powered by www.musixmatch.com

Link