O Sandamama

నువ్వు జల్లే వెన్నెలంతా సల్లగుందని
మిడిసిపోకే ఓ సందమామ
తన ఒళ్ళు కాల్చి ఎండ నీకు
ఎలిగిపోయే గుణమిచ్చిందే నా సందమామ

సందెఏళ కుంగుతుంటే
గెలిసినావని సంబరబడకే ఓ సందమామ
కణకణ నిప్పుల కణిక ఓలే
పొద్దుపొడిసే తెల్లవారి నా సందమామ
కీచురాళ్ళ చప్పుడు జేసి
గోసపెట్టినానుకోకే ఓ సందమామ
మబ్బు జేసే ఘర్జనలింటే
దద్దరిల్లి బుగ్గలైతవ్ నా సందమామ

ఆకుపచ్చని అమ్మతోటి
ఆకతాయి ఆటలొద్దే ఓ సందమామ
నిన్ను కూల్చగా జమ్మిచెట్టున
ఆయుధాలను దాచుకుందే నా సందమామ
సుట్టు సుక్కలు ఉన్నయంటూ
సూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామ
నీ సిట్టసివరి దారిలోన నీడ కూడా
తోడు రాదే నా సందమామ
సీకటంతా తాగి నువ్వు
సిత్తరంగా సిందెయ్యకే ఓ సందమామ
అమావాస్య ఘడియ నీకు
ముందరుందని మర్సిపోకే నా సందమామ

నేను నేననే పట్టుతోటి
నీకు నువ్వే దూరంగాకే ఓ సందమామ
నువ్వు పుట్టక ముందే పుట్టే
నువ్వు బోయినా ఉంటదే లోకం
నా సందమామ



Credits
Writer(s): Kasarla Shyam Kumar, Thaman S
Lyrics powered by www.musixmatch.com

Link