Chinna Maata

చిన్న మాట పైకి రాదా
ఎవరి కోసం వారేనా
ఉన్నమాట బయట పడదా
చివరి దాకా ఇంతేనా
నింగిలాంటి గుండెలో
వెన్నెలాగవలెనా
ఓ మేఘమై నీ మౌనమే
మోగుతుంటే లోన
చిన్న మాట పైకి రాదా
ఎవరి కోసం వారేనా

చేరువై దూరమా పేరుకే చేరాలా
గాలినే ఇంటిలో గోడలా చెయ్యాలా
చూపులే ఓదార్పు ఊపిరే జోలాలి
జ్ఞాపకాలీలోపు ఊసులై రావాలి
పనులు బరువైన చోట
పలుకు గడి దాటలేదా
అడుగు పడలేని చోట
అడగడము వీలు కాదా
దేనికో ఏమిటో తేల్చుకో
చిన్న మాట పైకి రాదా
ఎవరి కోసం వారేనా

వేకువ చీకటి ఊరికే మారాలా
కాలమే దారిగా జీవితం సాగాలా
వేరుగా వేరేగా మోయకే ఆ భారం
కొంతలో కొంతైనా పంచితే ఏం నేరం
వెలితి కరగాలి నేడు
వెలుగు కురవాలి మళ్ళీ
ఒకరికొకరైన జంట
ఒకటి కావాలి వెళ్ళి
శ్వాసలో శ్వాసగా మారగా

చిన్న మాట పైకి రాదా
ఎవరి కోసం వారేనా
ఉన్నమాట బయట పడదా
చివరిదాకా ఇంతేనా
నింగిలాంటి గుండెలో
వెన్నెలాగవలెనా
ఓ మేఘమై ఈ మౌనమే
మోగుతుంటే లోన
చిన్న మాట పైకి రాదా
ఎవరి కోసం వారేనా



Credits
Writer(s): Rajshri, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link