Oka Maata Okate Baanam (From "Dharmasthali")

ఒకమాట ఒకటే బాణం
ఒక సీత అదియే ధర్మం
ఇది నమ్మినవాడే ఉత్తముడు
అతడే శ్రీరామచంద్రుడు

ఒకబాట ఒకటే చిత్తం
జగమంతా కొలిచే సత్యం
సుగుణాల సార్వభౌముడూ
అతడే కోదండరాముడు

పితృవాక్య పరిపాలన కోసం
కానలకేగిన పుత్రుడు
రక్కసిమూకలతోనే యుద్దం
గెలిచెనులే రఘువీరుడు

ఆ మహావిష్ణువే త్రేతాయుగమున
రామభధ్రుడయ్యాడు
భద్రాచల శ్రీరాముడు
భద్రంగకాచు భగవంతుడు

రణ రణ రావణ బ్రహ్మతడు
దశకంఠుడై విర్రవీగాడు
పరమశివుడికే భక్తుండూ
రణతంత్రం తెలిసిన అసురుడు

ఉపనిషత్తులూ వేదాలెన్నో
అవపోసన పట్టేసాడు
ముల్లోకాలను గెలిచినోడు
సతిసీతనే అపహరించాడు

సీతకోసమై శ్రీ రాఘవుడే
అన్వేషణ సాగించాడు
లంకాధీశుని చెరనుందని
హనుమంతుడె జాడను తెచ్చాడు

వానర సైన్యంతో లంకకు
వారధి కట్టాడు
రాముడు రణమున దూకాడు
రావణ సంహారం చేసి
సీతను చేరాడు
రాముడు దేవుడు అయ్యాడు

రావణ అహాన్ని అణచిన
శ్రీరామ నామమే వేదం
అదిజగదానందకరం
అదిజగదానందకరం

విరోధి కళ్ళలో మన ధైర్యం
సమరానికి ముందే చూసేలా
విల్లు ఎక్కుపెట్టి శత్రువుపై
మన గెలుపు జెండా ఎగరేసేలా

గెలుపొక్కటె ఇక లక్ష్యంగా
ఆ రామ బాణమై దూసుకుపో
రఘునందనుడాదర్శంగా
ఆ నడవడినే అలవరుచుకో

ఏ తల్లిదండ్రైనా ఇట్టాంటి కొడుకుండాలంటూ
పూజలు వ్రతాలు చెసేలా
ఏ అన్నదమ్ములైనా ఇట్టాంటి
అన్నుండాలంటూ
తలచి గర్వంగ తిరిగేలా

రాముడి మార్గంలో నడిచి
చేసుకో నీ జన్మ ధన్యం
అది జగదానందకరం
అది జగదానందకరం



Credits
Writer(s): Vinod Yajamanya
Lyrics powered by www.musixmatch.com

Link