Chitti Chilakamma

చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా
తోట కెళ్లావా పండు తెచ్చావా
ఉయ్యాలా జంపాలా నిన్నెవరు ఊపాల
నీలాల కన్నులకు జోల ఎవరు పాడాల
ఈ నేలే నీకు ఉయ్యాలా
ఈ గాలే నీకు ఓ జోలా

గాలికి తెలియని రాగాలున్నవి
వానలు కురవని మేఘాలున్నవి
గుళ్లుగా మారిన పువ్వులు ఉన్నవి
రాళ్లలో దాగిన కన్నీళ్లున్నవి
మాటలకందని హిందోళం
ఇది మనసుకి చెందని మధ్యమావతి
శివునికి తెలియని శివరంజని ఇది
చివరకు మిగలని శ్రీరంజని ఇది
ఊపిరి తిత్తుల వాయులీనమిది
గుండె ధ్వనించిన మృదంగ జతి ఇది
ఎవ్వరు ఎన్నడు కనని వినని ధ్వని
ఎవ్వరు తోడుగ లేని బతుకు అని
కనుల కలల అలలు విరిగిపడు ధ్వని
మనసు చితిలో మంటలెగసి పడుకొని
వినాలి హృదయము చెవిగ మార్చుకొని
కనాలి తనువులు కనులు చేసుకొని
తబలాలెరుగని తళాంగుతకధిమి
నరాలు తెగిపడు నెత్తురొలుకు ధ్వని
తల్లి పాలకై తల్లడిల్లు
పసిబిడ్డ ఘోషకోరాగమున్నది
తండ్రి గుండెపై నిదరపోని
పసి కంటి రెప్పకో తాళమున్నది
నిప్పులు కురిసే మండుటెండలో
బగ్గున మండే అరిపాదాలకు
నడిచే నడకే నాట్యమైనది
అడుగు అడుగు ఒక భంగిమైనది
పిడికెడు మెతుకులు దొరకనప్పుడు
కడుపులో పేగులు కదిలినప్పుడు
అమ్మా అంటూ అరచినప్పుడు
ఆ పిలుపే ఒక వేధమైనది
ఆకలి నాకో పాట నేర్పినది
అశ్రువు ఇంకో పాట నేర్పినది
రాళ్ల బాటలో తగిలిన గాయం
పల్లవి లేని పాట నేర్పినది
కరగని కన్నీళ్లు రాతి గుండెల్లో
పగిలిన శతఘ్ని పాటలైనవి
నాకే సవాలు విసురుతున్నవి
నన్నే స్వరాలు కట్టమన్నవి

చితికిన చిరిగిన శృతిలయ విరిగిన
చితివలే రగిలిన చిటపట పదముల
పాటే చేశానా ప్రాణం పోసి పాడానా
మంటై నా పాటే
నన్నే దహించివేసేనా ఓఓ



Credits
Writer(s): S.a. Rajkumar, Sudhaala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link