Dandakam

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్

నీ నామసంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి
నీ మీద నే దండకం బొక్కటిన్ చేయనూహించి
నీ మూర్తింగాంచి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై
రామభక్తుండనై నిన్ను నే గొల్చెదన్

నన్ కటాక్షంబునన్ చూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే
నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ

నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే
దగ్గరన్ నిల్చితే దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై

స్వామి కార్యార్థమందుండి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు పూజించి యాద్భానుజుం బంటు గావించి
యవాలినిన్ జంపి కాకుత్థ్స తిలకున్ దయాదృష్టి వీక్షించి

కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్

లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
భూమిజం జూచి ఆనందముప్పొంగా
ఆ యుంగరంబిచ్చి ఆ రత్నమున్ తెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషని చేసి
సుగ్రీవుడాయంగదా జాంబవంతాది వీరాదులన్ గూడి
ఆ సేతువున్ దాటి వానరా మూక పెన్మూకలై
దైత్యులన్ ద్రుంచగా

రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి
ఆ శక్తియున్ వేసి ఆ లక్షణున్ మూర్ఛనొందించగా

అప్పుడే పోయి సంజీవియున్ తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షించగా

కుంభకర్ణాదులన్ వీరులన్ పోరి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా

అంత లోకంబులానందమై యుండ
అవ్వేళన్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి

సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముతో చేర్చి
అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ కూర్మి లేరంచు మన్నించిన

శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే

పాపముల్ బాయవే భయములున్ తీరవే భాగ్యముల్ గల్గవే
సకల సామ్రాజ్యముల్ సకల సంపత్కకరంముల్ గల్గవే

వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి

ఆ తారక బ్రహ్మ మంత్రంబు సంధానమున్ చేయుచున్ స్థిరమ్ముగా వజ్రదేహంబునున్ దాల్చి

శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతు నా జిహ్వయుందుండియున్ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై

రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై
బ్రహ్మతేజంబునన్ రౌద్రనిజ్వాల కల్లోల హావీర హనుమంత
ఓంకార శబ్ధంబులన్ క్రూర సర్వగ్రహ భూతప్రేత పిశాచ
శాకినీ ఢాకినీ మోహినీ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి

నీ ముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్
రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై
బ్రహ్మప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబునున్ జూపి

రారా నా ముద్దు కుమారాయన్చున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి
నమస్తే సదా బ్రహ్మచారి
నమస్తే వ్రతపూర్ణ హారి
నమస్తే వాయుపుత్రా నమస్తే నమో నమః



Credits
Writer(s): A.a. Raj
Lyrics powered by www.musixmatch.com

Link