Merise Merise

మెరిసే మెరిసే మెరిసే
కనులే తొలిగా మెరిసే
అరరె కలలే ఎదుటే వాలేనులే
మనసే మనసే మనసే
తనలో తనుగా మురిసే
మురిసే ఆనందంలో తడిసేనులే
ఈ క్షణం ఎదకి వినపడి
తొలి గెలుపే పిలిచే పిలుపే
ఇది వరకెరుగని మెరుపుల
మలుపిపుడే ఇపుడే ఇపుడే
చిత్రంగా చూస్తూ ఉంటే నేరుగా
చైత్రాలే స్వరాలు కూసే
చుట్టూరా సుమాలు పూసేనే
తొణికిసలే కళలే కళలే
అందంగా బంధాలల్లే వేళలో
వాకిట్లో వసంతమోచ్చేనే
దోసిట్లో వరాలు నింపేనే
కనిపెంచిన కాలం అనుకోనిది సాయం
అయినా అడుగటు వైపే కదిలే
కనిపించని నాలో చూపించెనే
తీరం కనుకే
మనసటు వైపే కదిలే

ఒకరితో ఒకరు ముడిపడు తరుణం
కడవరకూ విడిపోని కళ్యాణయోగం
నలుగురు కలిసే కలివిడి సమయం
ఈ హాయి చిరకాల జ్ఞాపకం
జత కలిపే గుణమే
అలవడితే వరమే
పనిలో పడితే నిలువున పరవశమే
సందడిగా జనమే ఒంటరిగా మనమే
మదిలో మెదిలే తెలియని కలవరమే
కనిపెంచిన కాలం అనుకోనిది సాయం
అయినా అడుగటు వైపే కదిలే
కనిపించని నాలో చూపించెనే
తీరం కనుకే
మనసటు వైపే కదిలే

వరసలు కలిపి మనసులు తెలిపే
అరమరికల పొడలేని సాంగత్యమేనా
అలసట మరిచి అటు ఇటు తిరిగి
ఊరంత వినిపించే వేడుకా
మది ఒకటే అడిగే
వలదన్నా వినదే
అసలే తనది ఎదగని పసితనమే
తనకోసం తరచూ పరుగెడుతూ పడుతూ
తను కోరినది వెతుకుట అవసరమే

కనిపెంచిన కాలం అనుకోనిది సాయం
అయినా అడుగటు వైపే కదిలే
కనిపించని నాలో చూపించెనే
తీరం కనుకే
మనసటు వైపే కదిలే



Credits
Writer(s): Bhaskarabhatla, Chaitan Bharadwaj
Lyrics powered by www.musixmatch.com

Link