Putuka Thone

పుటకతోనే ఎర్రాటి అంబారం
పులిమినారు నెత్తూటి సింధూరం
అడవి బాటై సాగే సంచారం
జగతి కోసం జరిగే జాగారం

బంధాలనొదిలేసి బంధూకు
సైన్యాలతో సావాసం
బడుగోల్ల బతుకుల్ని భద్రంగా
చూసేందుకీ వనవాసం
ఇతడో గగనము చీల్చే మిణుగు
గురుడో కడలడుగున నిప్పుల మడుగు
ఒకటై కలిసెను అడుగు అడుగు
ఇకపై ఇది ఉమ్మడి ఉద్యమ పరుగూ

ఇంద్రవెల్లి సూడే ఈ వంకా
చండ్రానిప్పు కొండాల కలయికా
పచ్చనాకు సైతం ఎరుపెక్కా
ఉరుము తాంది ఈల్ల పొలికేక
రెండేసి గుండెల్తో నిండార
నిదరోయెనీ అడివంతా
రెట్టింపు బలమైంది
దండెత్తు రణపోల్ల రహదారంతా
కొండా కనుమల మలుపులగుండా
కదిలే దయగల ధీరుల జెండా
తండా బతుకులు సల్లంగుండా
నిలిచే ఈసాయుధ యోధుల అండా

హుంబారే హుంబారే
హుంబారే హుంబారే
హుంబారే హుంబారే
హుంబారే హొయ్యా

హుంబారే హుంబారే
హుంబారే హుంబారే
హుంబారే హుంబారే
హుంబారే హొయ్యా



Credits
Writer(s): Ramajogayya Sastry, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link