Lullaby Song - Rajkumari (From "Vikrant Rona")

లాలీ జో లాలీ లాలీ
అన్నదీ చల్లని గాలి

లాలీ జో లాలీ లాలీ
అన్నదీ చల్లని గాలి
పాటలో పరిసరాలు మరచిపోవాలి, మరచిపోవాలి

చందమామ వెన్నెలంతా నీకే కానుక
పక్క మీది పువ్వయ్యింది నింగి తారక
వెండిరంగు దారాలల్లి
వెన్నెలమ్మ ఊయల వేసే
వెచ్చగా నిదురపోవే రాజకుమారి
నా రాజకుమారి

బూచి బాబు వస్తాడని భయమా
బుజ్జి తల్లి నీ తోడై నే లేనా
పిచ్చికల రానిస్తాన కన్నమ్మా
దూరముంచలేనా ఏ చీకటినైనా
చింతలేని ముఖము అలా
చిందనివ్వు పున్నమి కల
ప్రాణాలైదూ నీకు కాపాలా

మేఘమాల కరిగి చినుకైనా క్షణమిది
పచ్చనాకు పైనా మెరిసిందే చిరు తడి
ఆకసాల వాకిలి దాటి నేలతల్లి దోసిలి చేరే
నీటిబొట్టు పాడిన పాటే ముత్యాల లాలీ, ముత్యాల లాలీ

జీవితాన నువ్వున్నావు చాల్లే
కంటితడిని తుడిచే కొన వేలై
వెంట వెంట వస్తా నీ వెనకాలే
పాదాలతో కదిలే జత నీడై
ఊసుపోని అలకవైనా
పలుకుల చిలకవైనా
నీ సవ్వడే నాకు సందడి
సద్దు చేయకుండా నిలిపానే ఊపిరి
జాగు చేయకుండా నిదరోగ, రా మరి
చప్పున రెప్పలు మూసి చెయ్యవే కలల స్వారి
నిండుగా నిదురపోవే చిట్టి చిన్నారి, చిట్టీ చిన్నారి
చిట్టి చిన్నారి



Credits
Writer(s): B. Ajaneesh Loknath
Lyrics powered by www.musixmatch.com

Link