Onamalu Poovulai

ఓనమాలు పూవులై
ఒదిగిన ఓ కొమ్మా
కోటివిద్యలకు మూలం
నీవె చదువులమ్మా

ఓనమాలు పూవులై
ఒదిగిన ఓ కొమ్మా
కోటివిద్యలకు మూలం
నీవె చదువులమ్మా

పలుకులన్ని హంసలై
పరవశించి ఆడగా
భాషలు నీ చూపులై
పరిమళించి పాడగా

పలుకులన్ని హంసలై
పరవశించి ఆడగా
భాషలు నీ చూపులై
పరిమళించి పాడగా

వీణానాదమై
అక్షరవేదమై
సరస్వతిగ మాలో ప్రవహించవమ్మా

ఓనమాలు పూవులై
ఒదిగిన ఓ కొమ్మా
కోటివిద్యలకు మూలం
నీవె చదువులమ్మా

చేతవెన్నముద్దలోన
చలువ చందమామలోన
చిన్నారి నవ్వులోన
శ్రీగంగ నురగలోన

చేతవెన్నముద్దలోన
చలువ చందమామలోన
చిన్నారి నవ్వులోన
శ్రీగంగ నురగలోన

తెల్లదనం నీవు
తెలివిలోన నీవు
తలచిన హృదయాలే గుడులైనవమ్మా

ఓనమాలు పూవులై
ఒదిగిన ఓ కొమ్మా
కోటివిద్యలకు మూలం
నీవె చదువులమ్మా

ఓనమాలు పూవులై
ఒదిగిన ఓ కొమ్మా
కోటివిద్యలకు మూలం
నీవె చదువులమ్మా



Credits
Writer(s): Dr. Josyabhatla
Lyrics powered by www.musixmatch.com

Link