Christmas Kalam

క్రిస్మస్ కాలం క్రీస్తుజననం
ఎంతో. ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకేతెంచెలే

ఎంతో ఆనందమే...
రారాజు నీ జన్మమే
ఎంతోసంతోషమే
ఆ ప్రభుని ఆగమనమే

పరిశుధ్ధుడు జన్మించెను
పశువుల పాకలో
లోకాల నేలే రారాజుగా
ఆ బెత్లేహేములో
యూదా గోత్రములో.
ఒకతార కాంతిలో

క్రిస్మస్ కాలం క్రీస్తుజననం
ఎంతో. ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకేతెంచెలే

కాపరులు చాటించిరి
లోకాన శుభవార్తను
బంగారు,సాంబ్రాణి, బోళములు
అర్పించిరీ జ్ఙానులు
దూతలు స్త్రోత్రించిరి.
ఆ ప్రభుని ఘనపరచిరి

క్రిస్మస్ కాలం క్రీస్తుజననం
ఎంతో. ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ధరకేతెంచెలే

ఆ ప్రభువు జన్మించెను
నరరూపధారిగా
మనపాప పరిహర
బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా
ఆ ప్రభువు జన్మించెను
నరరూపధారిగా
మన పాపన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా
ఎంతో ఆనందమే.
రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే.
ఆ ప్రభుని ఆగమనమే...

క్రిస్మస్ కాలం క్రీస్తుజననం
ఎంతో. ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు
ధరకేతెంచెలే



Credits
Writer(s): Suresh Singapore
Lyrics powered by www.musixmatch.com

Link