Christmas Subhavelalo

ఆనందగీతం నే పాడెద
క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో

దూతల స్త్రోత్రాలతో
గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను
రక్షకుడే జన్మించెను"

ప్రభువొచ్చెను నరుడైపుట్టేను
రక్షకుడు జన్మించెను
మనపాపభారం తొలగింపను
ఈ భువికే దిగి వచ్చెను
దూతల స్త్రోత్రాలతో
గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను
రక్షకుడే జన్మించెను"

ఆనందగీతం నే పాడెద
క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో

దర్శించిరి పూజించిరి
జ్ఞానులు కీర్తించిరి
బంగారు సాంబ్రాణి బోళములు
ప్రభుయేసున కర్పించిరి
దూతల స్త్రోత్రాలతో
గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను
రక్షకుడే జన్మించెను"

ఆనందగీతం నే పాడెద
క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో

జన్మించెను మనల రక్షింపను
రారాజు జన్మించెను
కన్యక గర్భాన ప్రభుపుట్టెను
ప్రవచనమే నెరవేరెను
దూతల స్త్రోత్రాలతో
గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను
రక్షకుడే జన్మించెను

ఆనందగీతం నే పాడెద
క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో



Credits
Writer(s): Suresh Singapore
Lyrics powered by www.musixmatch.com

Link