Naa Pranama Nalo Neevu

పల్లవి: నా ప్రాణమా నాలో నీవు
క్రుంగియున్నావు ఎందుకు
నీ దేవుడు రక్షకుడు కాడా...
నీ దేవుడు బలవంతుడు కాడా...
దిగులేందుకు చింతేందుకు
నీ దేవుడు నీతో ఉండును

1)మోషేను పిలుచుకున్నావు
మహిమాత్మతో నింపి వాడుకున్నావు
సర్వశక్తుడా కృపామయుడా
మోషే లాగా నన్ను నీవు వాడుకోమయ్యా

2)శోధనలో విజయం యియుమా
కీడులోన నాకు తోడుగుండవా
ధైర్యము లేదయ్యా ఓనా యేసయ్యా
నీ రెక్కల క్రింద నన్ను దాచుకోమయ్యా

3) శత్రువులే చుట్టుముట్టిన
అవమానలకు గురిచేసిన
క్రుంగియున్నాను మంచి యేసయ్యా
నా హృదయా వాంఛన తీర్చుమయ్యా

4)వేదనలో బాధలో
కన్నీరే నాకు మిత్రువాయేనా
భరించలేనయ్యా అయ్యా యేసయ్యా
ఈ క్షణమందే నాతో మాట్లాడుమా



Credits
Writer(s): Rev.dr.yesupadam
Lyrics powered by www.musixmatch.com

Link