Seethakoka Chiluka

సీతాకోక చిలుక నీ కథ వినవే
నీదే అయినా నీకస్సలు తెలియనిదే
నువ్వే వాలాలని ఓ గుండె
వేచుందని తెలుసా... ఓ ఓ ఓఓ

పగలే మెరిసే... మిణుగురువే నువ్వేలే
అటుకో ఇటుకో... తెగ ఎగిరెలుతుంటావే
వెళుతూ నా మనసును
ఎగరేసుకెళ్తావని తెలుసా

నీ కల చూసి... నిద్దుర లేస్తే
కనురెప్పలకెన్నెన్ని రంగులో తెలుసా
నీతో సాగే పయనం కోసం
ఓ హృదయం వేచుందని తెలుసా మనసా
నీ ప్రేమలు నా గురుతులివే

సీతాకోక చిలుక నీ కథ వినవే
నీదే అయినా నీకస్సలు తెలియనిదే
నువ్వే వాలాలని ఓ గుండె
వేచుందని తెలుసా... ఓ ఓ ఓఓ

కన్నులు రెండూ నువే వచ్చి వాలే కిటికీలే
నిన్నే చూస్తూ చప్పుడు చెయ్యవు రెప్పల తలుపులే
నీతో ఊసులాడాలని వేచే పెదవులే
నువ్వే ఎదుటకొచ్చేవేళా ఎన్నో మౌనాలే

చెలియా ఏమరపాటై నను చూశావో
ఆకాశం తలకిందై... కాలికంటేనే
అర నవ్వొకటి నువ్విసిరావో
ఆ రోజిక పండుగ రోజే

సీతాకోక చిలుక నీ కథ వినవే
నీదే అయినా నీకస్సలు తెలియనిదే
నువ్వే వాలాలని ఓ గుండె
వేచుందని తెలుసా

నేలపైన తేలే గాలిపటం నువ్వేలే
నీకే దారమయ్యే దారికెన్నో దూరాలే
నిన్నే అందుకోవాలని పిల్లాడిమల్లే
ఎంతల్లాడిపోతున్నానంటే మాటలకందదులే

చెలియా నువ్వే ఉండే చోటేదైన
అందానికి సరి కొత్త సంతకమదిలే
రెక్కలు ఉన్న నక్షత్రంవే
లక్షల లక్షణముల వలవే

సీతాకోక చిలుక... నీ కథ వినవే
నీదే అయినా... నీకస్సలు తెలియనిదే
నువ్వే వాలాలని ఓ గుండె
వేచుందని తెలుసా, ఓఓ ఓ ఓ ఓ



Credits
Writer(s): Arun R Rajamani, Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link