Harom Hara

హర హర హర హర హర
హర హర హర హర హర
హరోం హరా హరోం హరా

పరుగులు తీసే యవ్వనం
పెను ప్రమాదమున తోసే
ఉరకలు వేసే ప్రాయమే
ఉరితాడై మెడ బిగిసే
పరుగులు తీసే యవ్వనం
పెను ప్రమాదమున తోసే
ఉరకలు వేసే ప్రాయమే
ఉరితాడై మెడ బిగిసే
కటినమైనది కాలం నడక
కత్తులు దూసెను ముందెనక
జటిల మైనది జీవన చెరక
ఏ క్షణమాగునో తెలియదుగా
తెలిసిన దేవర హారోమ్ హారా
జరిగెను ఘోరం హరోమ్ హరా
తెలుపర ఫలితం హరొమ్ హరా హరోమ్ హరా
ప్రేమను చూపర హరోమ్ హరా
ప్రాణము నిలుపర హరోమ్ హరా
తీరము చేర్చరా హరోమ్ హరా హరోమ్ హరా
ఓం హరా హరోం హరా

అమృతమే హాలాహలమై
ఆయువునే బలికోరినదే
అనురాగం అపశృతి పలికిక
ఆవేదన రాగమిదే
హద్దులు మీరి స్వేచ్ఛను కోరే
బుద్దే మనసున పుట్టిందా
రెచ్చిన కోరిక పిచ్చినతనంతో
కామపు చిచ్చుల కాల్చినదా
కన్నవారికి హరోమ్ హరా
కలతలు మిగిలెను హరోమ్ హరా
చితికిన బ్రతుకులు హారోమ్ హారా హారొమ్ హారా
గమ్యం మరిచిరి హారోమ్ హరా
పయనం ఇదికదా హరోమ్ హారా
చివరకు ఏవరవు హరోమ్ హరా హరొమ్ హరా
ఓం హరా హరోం హరా

ఆశయాన్ని విడిచిన యువత
అడ్డదారి పయనిస్తుంటే
కనులుండి మన ఈ సంఘం
కబోధిలా చూస్తూ ఉంటే
భావితరాల భవితవ్యానికి
బ్రతుకే చిక్కుల ప్రశ్నవదా?
కారగారపు ఖైదిగ నిలిచి
చికటిమూగిన చరితవదా
యాతన తీర్చరా హరోమ్ హరా
చేయూత ఇవ్వరా హరోమ్ హరా
చేతన చూపరా హరోమ్ హరా హరోమ్ హరా
సత్యం తెలిసిన హరోమ్ హరా
సాక్ష్యం నీవుగా హరోమ్ హరా
మోక్షం ఇవ్వరా హారోమ్ హరా హరోమ్ హరా

హరోం హరా హరోం హరా



Credits
Writer(s): Sadachandra
Lyrics powered by www.musixmatch.com

Link