Ayyo Ento (From "Kalyanam Kamaneeyam")

అయ్యో ఏంటో
నాకు అన్ని వచ్చి పక్కనున్న
ఒక్క అదృష్టమేమో దూరముందే
అన్ని ఇచ్చేసినట్టే ఇచ్చి లాగేసుకుంటు
దైవం వైకుంఠపాళి ఆడతాడే
చేతుల్లో గీతలన్ని వంకరేమో
చూపిస్తే ఎవ్వరైనా నమ్మరేమో
పైవాడి కోపమింకా తగ్గదేమో
రోజొచ్చే టెస్టుల్లోన నెగ్గనేమో

అయ్యో ఏంటో
నాకు అన్ని వచ్చి పక్కనున్న
లక్కే దోబూచులాడి దూరముంది
అన్ని ఇచ్చేసినట్టే ఇచ్చి లాగేసుకుంటు
దైవం వైకుంఠపాళి ఆడతాడే

ఎందుకు నాకీ శిక్ష
అరె ఎవరికి నాపై కక్ష
ఓ దేవుడ నువ్వే రక్ష
అరె లంచం ఇవ్వన లక్ష

నావల్ల తప్పులుంటే దిద్దేయనా
ఇన్నాళ్ళు ఉన్న తీరు మార్చేయనా
కోపాలు కొంచమున్న తీసేయనా
నీ నవ్వులే కోరనా ఆ ఆ

దాగున్న మాటలన్ని నే పంచనా
చోటిస్తె చాలు నాకు నీ పంచనా
ఈ మధ్య దూరమంతా తెంచేయనా
నే కొత్తదారి ఎంచుకోనా ఆ ఆ

ఎందుకు నాకీశిక్ష
అరె ఎవరికి నాపై కక్ష
ఓ దేవుడ నువ్వే రక్ష
అరె లంచం ఇవ్వన లక్ష



Credits
Writer(s): Krishna Kanth, Shravan Bharadwaj
Lyrics powered by www.musixmatch.com

Link