Vayasaa Ela Moyagalavee

వయసా ఎలా మోయగలవీ
హాయి బారము
మనసా ఎలా చేయగలవో
రాయ బారము
అతడినే అడిగినావే

వయసా ఎలా మోయగలవీ
హాయి బారము
మనసా ఎలా చేయగలవో
రాయ బారము
అతడినే అడిగినావే
వయసా ఎలా మోయగలవీ
హాయి బారము

గుండెల సవ్వడి శృతి లయ
మార్చెను ఎందుచేతనో
ఆతడి అడుగుల సడి అనిపించెను
ఏమి సేతునో
నిలువున నిమిరిన నవ పరిమలములు
ఎంత వెచ్చనో
ఆఖరి శ్వాసను ఈ చలి గాలులు
వెంట తెచ్చెనో
నిన్న మొన్నటి నేస్తమా
నా సమస్తం సొంతమా
పరువమా అడిగినావే

వయసా ఎలా మోయగలవీ
హాయి బారము
మనసా ఎలా చేయగలవో
రాయ బారము

దోసిలితోనే తీసిన తియ్యని
ఏటి నీటిలో
తోచిన సంగతి పెదవికి తాకితే
ఎన్ని నవ్వులో
ఎగువన ఆతడు తాగిన నీరిది
అన్న ఊహలో
తడిమిన ఆతడి తడి తాకిడిలో
ఎన్ని ముద్దులో
స్నానమింకా సాగునా
సిగ్గు ఇంకా దాగునా
బిడియమా అడిగినావే

వయసా ఎలా మోయగలవీ
హాయి బారము
మనసా ఎలా చేయగలవో
రాయ బారము
అతడినే అడిగినావే

వయసా ఎలా మోయగలవీ
హాయి బారము
మనసా ఎలా చేయగలవో
రాయ బారము



Credits
Writer(s): Sirivennela Sitharama Shastry, S. Vasu Rao
Lyrics powered by www.musixmatch.com

Link