Manaasaa Thullipadake

మనసా తుళ్ళిపడకే. అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా... తెలుసా
మనసా తుళ్ళిపడకే... అతిగా ఆశపడకే

ఏమంత అందాలు కలవనీ ... వస్తాడు నిన్ను వలచి
ఏమంత సిరి ఉంది నీకనీ ... మురిసేను నిన్ను తలచి
చదువా... పదవా ... ఏముంది నీకు
తళుకు ... కులుకు ... ఏదమ్మ నీకు.
శ్రుతిమించకే నీవు మనసా...

మనసా తుళ్ళిపడకే. అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా... తెలుసా
మనసా తుళ్ళిపడకే... అతిగా ఆశపడకే

ఏ నోము నోచావు నీవనీ ... దొరికేను ఆ ప్రేమఫలము
ఏ దేవుడిస్తాడు నీకనీ ... అరుదైన అంత వరము
మనసా వినవే మహ అందగాడు
కనుకా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా...

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియా వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా ... తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే



Credits
Writer(s): Naidu P Ramesh, Veturi Sundara Rama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link