Vesavi Kalam (From "Kalyanamastu ")

వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే
ఎంతో కాలం వేచా నీకై
కలిసే కాలం వచ్చే మనకై
కలలే దాటి నన్నే చేరావే
నీ వైపే చూసేలా
నా కళ్ళకి సంకెళ్లు వేసావులే
నీ వెంటే సాగేలా
పాదాలకి పాఠాలు నేర్పావులే
మ్ కనికట్టే చేసావే కనుసైగతో

వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే
ఎంతో కాలం వేచా నీకై
కలిసే కాలం వచ్చే మనకై
కలలే దాటి నన్నే చేరావే

నీ జతలో నీడల్లే ఉండనా
కడదాకా కన్నీరు అన్నదే రానీకా
ఏం మాయనో నడిపింది నన్నిలా
నీదాకా అడుగైన దూరమే కానింకా
ఏ జన్మలోను ఇంతటి యోగం రాదే
ఎనలేని సంతోషాల జాడే నీవే
హరివిల్లై రంగుల్లో ముంచేసావే

వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే

ఓ కధగా చెప్పాలి అంట
నీపై ఇష్టం ఎంతైనా
సరిపోదులే సమయం
నీ నవ్వునే చూస్తూనే ఉంటే
మరి కలకాలం నను ఆపలేదు
ఇక ఏ కష్టం
కలనైనా విడిపోదాంట నీపై ధ్యాస
కడదాక నీదేనంట నా ప్రతి శ్వాసా
హో అయిపోయా నీ ప్రేమకే బానిసా

వేసవికాలం వెన్నెల నువ్వై
సాయంకాలం చల్లని గాలై
గుండెల్లోకి వచ్చి వాలావే
ఎంతో కాలం వేచా నీకై
కలిసే కాలం వచ్చే మనకై
కలలే దాటి నన్నే చేరావే



Credits
Writer(s): Rr Dhruvan, Alaraju Alaraju
Lyrics powered by www.musixmatch.com

Link