Rela Rela (From "Vimanam")

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగా జూపిస్తాది
సంబరాల జాడ
సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగా జూపిస్తాది
సంబరాల జాడ
ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకు మించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా
రేలారేల రేలారేల
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగా జూపిస్తాది
సంబరాల జాడ

వేల వేల వెన్నెలలే
నవ్వులుగా మారి
పెదవుల పైనే విరబూసాయేమో
చుట్టూ ఉన్నవాళ్ళే
నీ చుట్టాలు ఈడ
ఇంతకన్న స్వర్గం ఇంకేడా లేదో
ఇల్లే జూస్తే ఇరుకురో
అల్లుకున్న ప్రేమలు చెరుకురో
తన హృదయం ఓ కోటరో
నువ్వే దానికి రారాజురో
రేలారేల రేలారేల
రెక్కల గుర్రం ఎక్కాలా
లెక్కే లేని ఆనందాన
సుక్కలు తెంపుకు రావాలా

నువ్వు కన్న కలలే
నిజమౌతాయి చూడు
అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు
దశరథ మారాజే నాన్నై పుట్టాడు
నువ్వు రాముడంత ఎదగర నేడు
చరితలు ఎన్నడు చూడనీ
మమతల గూడే మీదిరో
సంపద అంటే ఏదో కాదురో
ఇంతకు మించి ఏది లేదురో
రేలారేల రేలారేల
నీదే నింగీ నేలా
నిత్యం పండగల్లె బతుకు
జన్మే ధన్యమయ్యేలా
సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగా జూపిస్తాది
సంబరాల జాడ
ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకు మించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా

రేలారేల రేలారేల
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా



Credits
Writer(s): Charan Arjun
Lyrics powered by www.musixmatch.com

Link