Cheyyi Cheyyi Kalipeddam

చెయ్యి చెయ్యి కలిపేద్దాం
చేతనైంది చేసేద్దాం
నువ్వు నేను ఒకటవ్వుదాం
నవ్వు కుంటూ పని చేద్దాం
ఊరగాయ ఊరేద్ధాం కూరగాయ తరిగేద్ధాం
విస్తరిని పరిచేద్ధాం విస్తరించి కలిసుందాం

మా వంట మీకందించి
మీ వంట మేమే మెచ్చి
అందరం అనుబంధాల వంటకాలు ఆస్వాదిద్దాం
మా రుచి మీకే పంచి
మీ రుచి మేమే నచ్చి
అందరం అనురాగాల కొత్త రుచి ఆహ్వానిద్దాం
ఆహారం మన ఆచారం
పంచేద్దాం మన ఆప్యాయం
ఆహారం మన ఆచారం
పంచేద్దాం మన ఆప్యాయం

గుమ్మడి పులుసుతో
గుమ్మడి పులుసుతో గుండెలు మురవని
కమ్మని పెరుగుతో ప్రేమలు పెరగని
గారెలు వడలతో దారులు కలవని
గరిజల తీపితో వరసయిపోనీ
ఓరుగల్లు నుండి బియ్యం తెచ్చి
పాలకొల్లు నుండి కూరలు తెచ్చి
అరే కడప నుండి నాటు కారం తెచ్చి
శాకాహారం సిద్దం

బెల్లంపల్లి నుండి బొగ్గు తెచ్చి
తాడేపల్లి నుండి పాలు తెచ్చి
అరే అనకాపల్లి నుండి
పంచదార తెచ్చి
అందరికి పాంచాలి పాయసం
ఇలా ఇలా ఇలా ఈవేళా
మా వంట మీకందించి
మీ వంట మేమే మెచ్చి
అందరం అనుబంధాల వంటకాలు ఆస్వాదిద్దాం
మా రుచి మీకే పంచి
మీ రుచి మేమే నచ్చి
అందరం అనురాగాల కొత్త రుచి ఆహ్వానిద్దాం
ఓ చుట్టుకున్న చుట్టరికం
గాటు తీపి సన్నిహితం
సర్ధుకుంటే ప్రతి క్షణం
సంతోషాల విందు భోజనం

ఆహారం మన ఆచారం
పంచేద్దాం మన ఆప్యాయం
ఆహారం మన ఆచారం
పంచేద్దాం మన ఆప్యాయం



Credits
Writer(s): Mickey J Meyer
Lyrics powered by www.musixmatch.com

Link