Pedhavulu Veedi Maunam (From "Takkar")

పెదవులు వీడి మౌనం
మధువులు కోరె వైనం
తనువులు చేసే స్నేహం నేడే
తొలకరి రేపే తాపం
అలజడి కోరె సాయం
తపనలు తీర్చు భారం నీదే
పదములే కరువయే
తాకుతూ మాటాడనా నీతో
దూరమే మాయమై
ఊపిరే శ్రమించెనా మాతో హో హో హో
హో హో హో
తమకములో తడబడగా
విడివిడిగా ఓ సుఖమిదిగా

వానల్నే అడిగాగా ఆకాశం
వదిలేసే జాబిల్లై వచ్చావే
నన్ను వెతుకుతూనే
నే కోరే వరమేగా
నీలాగ నిజమేగా
ఈ బంధం నిలిచేగా
మనని కలుపుతూనే
ఆ నింగే సగమై దాగే కౌగిలిలో
సరదా రాతిరిలో గోగు పూలు విరిసే
ముగిశాక వర్షం జారే చినుకల్లే
అలిసాక దేహం వదలలేని తనమే
దరి నీవా నది నేనా
కలిశాక ప్రేమ తీరమే

తమకములో తడబడగా
విడివిడిగా ఒక సుఖమిదిగా



Credits
Writer(s): Krishna Kanth, Nivas K Prasanna
Lyrics powered by www.musixmatch.com

Link