Priya Mithunam

అనగా అనగా మొదలు
మీతోనే మీలోనే కలిసున్నా
కాలం కదిలే వరకు
మీతోనే కొనసాగే కలగన్నా
నీ వలెనే నేనున్నా
నా విలువే నీవన్న
జగమేలే నా హృదయాన్నేలే
జానకివి నువ్వే
ప్రియ మిధునం మనలా
జతగూడి వరమై
ఇరువురిదొక దేహం ఒక ప్రాణం
మన కధనం తరమున
దరి దాటే స్వరమై
పలువురు కొనియాడే కొలమానం

అయోధ్యను మించినది
అనురాగపు సామ్రాజ్యం
అది రాముని పుణ్యమెగా
అవనిజకి సౌభాగ్యం
తన విల్లే శోభిల్లి
ఆనోరినిని నేనేలే
పతివ్రతలే ప్రణమిల్లే గుణ సుందరివే
నీపైనే ప్రతిధ్యాస
నీతోనే తుది శ్వాస
జగమేలే నా హృదయాన్నేలే
జానకివి నువ్వేలే
ప్రియ మిధునం మనలా
జతగూడి వరమై
ఇరువురిదొక దేహం ఒక ప్రాణం

మన కధనం తరమున
దరి దాటే స్వరమై
పలువురు కొనియాడే కొలమానం



Credits
Writer(s): Ajay-atul
Lyrics powered by www.musixmatch.com

Link