Theerani Dhaahame

తీరని దాహమే నీ గుండెలో దాగెనా
చీకటి దారి పయనం
గమ్యం చేర్చునా
ఆరని మంటలే పొగలా కమ్మెనా
చుట్టూ లోకమే మాయం అయ్యేనా
నిన్నలే దాటిన ఈ ఉదయం
వేదనకే జ్ఞాపకం
మిన్నులే అంటినదా జ్వలనం
ఊపిరికే కలవరం
కదిలే కాలం ఆగే తరుణం
పాపాలను కడిగే కన్నీరుంటుందా
ఓ చినుకే వరదై తరిమే
సంఖ్యలతో పరుగులా
ఓ మలుపే ఎదురై నిలిచే
ఈ వ్యధతో నీ తీరం చేరాలా

వెనకే పడుతూ నీడై నడిచే
కర్మే ఇదిలే వదిలి పోదే
అరచేతులలో రేఖల్లాగా
గతమే ఎపుడూ మాయదులే
కరిగే నిమిషం ప్రశ్నయి మిగిలే

కలయా నిజమా జరిగే కధనం
ఏ గంగా జలములు
నిన్నే కడిగేనో
నీ అడుగే పసిపాపలలో
ఆయువునే తీసేలే
ఆ మరకే మసిలా
నిషిలో తోసెనులే
ధూమం ఓలే

తీరని దాహమే నీ గుండెలో దాగెనా
చీకటి దారి పయనం
గమ్యం చేర్చునా



Credits
Writer(s): Rambabu Gosala, Poornachandra Tejaswi S.v.
Lyrics powered by www.musixmatch.com

Link