Bulbul Tarang (From "Ramarao On Duty")

తూలే గిరగిరమని బుర్రే ఇట్టా
తేలిందే నెలవంతా అడుగుల వెంటా

బుల్ బుల్ త్రాన్గ్ బుల్ బుల్ త్రాన్గ్ లోకం ఊగే
గుండె లబ్ డబ్బు మాని నీపేరై మోగే
ఏదేదో భాషల్లో నవ్వే వాగే పిల్లా
అల్లాడి నీవైపు మనసే లాగే
నింగే రంగుల్ని వానై చల్లే
ఉబ్బి తబ్బిబ్బై మబ్బే
గాలే గంజాయి వాసనలే వీచే
మత్తే చిత్తయ్యే ముద్దిచ్చినావే

తూలే గిరగిరమని బుర్రే ఇట్టా (బుర్రే ఇట్టా)
తేలిందే నెలవంతా అడుగుల వెంటా
కాలే పెదవులపై ముద్దుల చిట్టా
వాలిందే ఎద గూటిన పాలపిట్ట

అద్దానికి ఈ రాయికి
ఓ వింత ప్రేమ మొదలయ్యే
అద్దం అలా రాయినే ఇలా
తాకంగా రాయి పగిలెనే
పాతాళమా ఇది ఆకాశమా
నీ ప్రేమలో పడుతూనే ఎగిరా
నా బుజ్జి బంగారం నాప్రేమ నీతోనే
బ్రతుకంతా చెరి సగమై బ్రతికేద్దామా

తూలే గిరగిరమని బుర్రే ఇట్టా
తేలిందే నెలవంతా అడుగుల వెంటా
కాలే పెదవులపై ముద్దుల చిట్టా
వాలిందే ఎద గూటిన పాలపిట్ట

బుల్ బుల్ త్రాన్గ్ బుల్ బుల్ త్రాన్గ్ లోకం ఊగే
గుండె లబ్ డబ్బు మాని నీపేరై మోగే
ఏదేదో భాషల్లో నవ్వే వాగే పిల్లా
అల్లాడి నీవైపు మనసే లాగే



Credits
Writer(s): Rakendu Mouli, Sam Charles
Lyrics powered by www.musixmatch.com

Link