Yevare Yevare Neevu (From "Balu Gadi Love Story")

ఎవరే ఎవరే నీవు
నా ఎద లోకొచ్చేశావు
ప్రేమా ప్రేమా అంటూ
నను మోసం చేసేశావు
ఎవరి దానివో నీవు
ఎద గాయమై పోయావు
చివరకు నువ్వే నన్నిలా
ఏకాకిని చేసేశావు
నిన్నే నమ్మాను నిన్నే వలచాను
కడకు నాకు కన్నీటిని కానుకగిచ్చావు

ఎవరే ఎవరే నీవు
నా ఎద లోకొచ్చేశావు
ప్రేమా ప్రేమా అంటూ
నను మోసం చేసేశావు

ఏమో అనుకున్నా ఇంకేదో కలకన్నా
నిండు నూరేళ్ళు నీవే జతవనుకున్నా
ఎంతో ఊహించా నిన్నెంతో పూజించా
నా తోడు నీడగా ఉంటావనుకున్నా
ప్రాణంకన్నా మిన్నగా నిను ప్రేమించానే
ప్రతి క్షణము నీ జ్ఞాపకంలో జీవిస్తున్నానే
చేసిన బాసలు విడిచావే
చెప్పిన ఊసులు మరిచావే
చెలిమికి ద్రోహం చేశావే
చివరికి దూరం అయ్యావే

ఏదో జరిగింది నా హృదయం పగిలింది
రెప్ప చాటున నీ రూపం మిగిలింది
ఏదో అనుమానం ఎదనే తొలిచిందా
నిన్ను నన్ను కాలం విడదీసింది
లోకం మరచి నిన్నే నే ద్యానిస్తున్నా
ప్రతి రోజు నీకోసం నే బతికేస్తున్నా
నచ్చిన బాటలో నడిచావే
మెచ్చిన మనసును విడిచావే
చిచ్చును నాలో రేపావే
చావుకు చేరువ చేశావే

ఎవరే ఎవరే నీవు
నా ఎద లోకొచ్చేశావు
ప్రేమా ప్రేమా అంటూ
నను మోసం చేసేశావు



Credits
Writer(s): Bikki Krishna, Ghanashyam
Lyrics powered by www.musixmatch.com

Link