Chigurantha Navvave (From "Akka Chellelu")

జో లాలి జో జో లాలి జో
చిగురంత నవ్వవే చిట్టి తల్లి
లేనిపోని చింత దేనికి
చిక్కులంటూ ఉండవే సిరిమల్లి
దుఃఖమంటూ లేని వాళ్లకి
చిన్నబోకే చిన్నారి ఎంత కష్టమొచ్చినా
వెన్నెలంటి నవ్వుంటే చీకటుండునా

చిగురంత నవ్వవే చిట్టి తల్లి
లేనిపోని చింత దేనికి
చిక్కులంటూ ఉండవే సిరిమల్లి
దుఃఖమంటూ లేని వాళ్లకి

పెళ్లైన ఆడజన్మ పడకింటి
ఆట బొమ్మ
తాళలేరా వేళ చూసైనా
శృంగార సార్వభౌమ కంగారు కౄడదమ్మా
రేయి పగలు రాసలీలేనా
ఆలితో మాటుగా అమ్మ నయ్యానుగా
కౌగిలే కాపురం అయితే ఎలా
చల్లారని సరసానికి సంసారమా

చిగురంత నవ్వవే చిట్టి తల్లి
లేనిపోని చింత దేనికి
చిక్కులంటూ ఉండవే సిరిమల్లి
దుఃఖమంటూ లేని వాళ్లకి
చిన్నబోకే చిన్నారి ఎంత కష్టమొచ్చినా
వెన్నెలంటి నవ్వుంటే చీకటుండునా
చిగురంత నవ్వవే చిట్టి తల్లి
లేనిపోని చింత దేనికి
చిక్కులంటూ ఉండవే సిరిమల్లి
దుఃఖమంటూ లేని వాళ్లకి

మోహమే కళ్లు మూసి
మమతనే కాల రాసి
కామదాహం గొంతు కోసింది
మనసునే మాయ చేసి
మనిషినే మృగాన్ని చేసి
పాడు మైకం గొంతు లేసింది
తాపమే శాపమై కట్టుబడి దాటితే
దీపమే జ్వాలగా కాల్చిపోదా
కళ్లమ్మిడే కల్లోలమే కళ్యాణమా



Credits
Writer(s): Sirivennela Sitharama Shastry, Sri
Lyrics powered by www.musixmatch.com

Link