Adiga Adiga (From "Maama Mascheendra")

అడిగా అడిగా విధినే అడిగా
నను మోసిన అమ్మ ఒడిని గుడిగా
ఎదిగా ఎదిగా ఎదలో ఎదగా
కనుపాపలో దాచుకున్న కలగా
ఏనాటి రుణమో పంచ ప్రాణాలై
నీ తోడు నాదాయెలే
నీ నోటి మాటైనా లాలి పాటల్లే
ఊయలే ఊపగా ప్రేమ సిరి దొరికెను
తిరిగి గతమే తన స్వాగతమే
అమ్మా మళ్లీ పెంచవా
నీ లాలనే పంచవా
నీ ప్రేమలో ముంచవా

బుడి అడుగులు తడబడగా
తన వడి నడకలు అలవడెగా
తన చేయూతగా తన మాట బాటగా
చురుకు చూపు నేర్పింది
జగతిని కనగా
తన దోర ముద్దులు
తన గోరు ముద్దలు
మరళ నేను కోరినానుగా
ఇది జీవితమే
శరదాం శతమే
అమ్మా మళ్లీ పెంచవా
నీ లాలనే పంచవా
నీ ప్రేమలో ముంచవా

మమతలు కురిసిన ప్రతి మనిషి
నిజమగు జననిగా ఇల నిలిచి
అనురాగ భావనే అసలైన దీవెన
అవధి లేని ఆ ప్రేమ అర్ధమే అమ్మ
అభిమాన వారధి అరుదైన సారధి
మదిని స్వార్థమేమి లేనిది
బ్రతుకో వ్రతమే పరమోన్నతమే

అమ్మా మళ్లీ పెంచవా
నీ లాలనే పంచవా
నీ ప్రేమలో ముంచవా



Credits
Writer(s): Chaitanya Prasad, Chaitan Bharadwaj
Lyrics powered by www.musixmatch.com

Link