Cheli Cheli Kalavarame (From "Maama Mascheendra")

చెలి చెలి ఇది కలవరమే
పరుగెత్తడమే నువ్వంటే ఒక మలుపే
వలపే చెలి వలపే
అరకొర ప్రేమెందుకురా ఒడికే చేరా
తలపులు నిను తలవడమే
యెలుగెత్తడమే ప్రేమంటే ఒక తలుపే
కుదిరే జత కుదిరే
దొరకని చనువెందుకురా వదిలేసెయ్ రా
కనులు విడిచి మరిచి నిలువగలవా
మనసునడుగు ఏంటి గొడవ
పెదవులడుగు చెలిమి తెలుపు చెలువ
కనికరించమన్నదే
అడుగుతున్న అడుగు అడుగు కలువ
అడుగు తీసి బయటపడవా
తరుగుతుంది వలపు వయసు త్వరగా
గుండె మోగుతున్నదే

చుక్కలా ఉన్నావనుకున్నా
చుక్కలే చూస్తున్నా
నీ పూల సొగసే ఇలా
గుచ్చే ముళ్లయ్యేనా
నవ్వితే కలలే కన్నా
నువ్వు నా సగమనుకున్నా
నన్ను మరి మరచావే
నువ్ మాయ లేడిలా
పక్క నుండి విరహాలే డేగ కళ్లలోని
ప్రేమనంత చూడలేవా
గుర్తుందా నీకు कादल కాలము
చెప్పలేని ప్రేమ ప్రేమేనా
నువ్వు దగ్గరే ఉన్నావిలా
కట్టేసినట్టు దూరమై పోతావెలా
చెప్పుతోంది పిచ్చిగా ఏంటో ఇలా
నువ్వంటే పడి చచ్చిపోతానే ఎలా
ఓ కోకిలా ఏకాకిలా లా లా
కనులు విడిచి మరిచి నిలువగలవా
మనసునడుగు ఏంటి ఈ గొడవ
పెదవులడుగు చెలిమి తెలుపు చెలువ
కనికరించమన్నదే

ప్రాణమే ఇంకేమివ్వాలే
ప్రాణమే పోతుంటే
నీ నీలి కళ్లల్లో కళ
కళ్లల్లో కన్నీరేనా
ఎగిసిన అలనవుతున్నా
నువ్వు నా నిజమనుకున్నా
కన్నులని మూసావే
నావైపు రా ఇలా
మొండితనమేంటమ్మ నా గుండెలోని
వేదనేంటో చూడలేవా
బుద్దిలేని మాయా లోకం
చిక్కులేని లెక్క పోసెయ్ వా
ఇది పస్తులా పరీక్షలా
చిక్కినట్టు మాయమై పోతావెలా
కట్టేసినట్టు కలలే చల్లావిలా
చుట్టు ముట్టి కట్టుకుంటావే ఎలా
ఉండే ఇలా అందవెలా లా లా

కనులు విడిచి మరిచి నిలువగలవా
మనసునడుగు ఏంటి గొడవ
పెదవులడుగు చెలిమి తెలుపు చెలువ
కనికరించమన్నదే
అడుగుతున్న అడుగు అడుగు కలువా
అడుగు తీసి బయటపడవా
తరుగుతుంది వలపు వయసు త్వరగా
గుండె మోగుతున్నదే



Credits
Writer(s): Chaitan Bharadwaj, Vengi
Lyrics powered by www.musixmatch.com

Link