Pothugadda (From "Razakar")

పాదాన ముల్లు గుచ్చితే
బాధతో తల్లడిల్లేది
కడుపులో భళ్లెం దించితే
నీ పెదవుల్లో నవ్వు ఏందిది

పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా
నిద్దర పోతున్నరా
రేపు పొద్దుగాల
ఏగు చుక్కవోలే మేల్కొంటరా
(పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)
(నిద్దర పోతున్నరా)
(రేపు పొద్దుగాల)
(ఏగు చుక్కవోలే మేల్కొంటరా)
పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా
నిద్దర పోతున్నరా
రేపు పొద్దుగాల
ఏగు చుక్కవోలే మేల్కొంటరా
(పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)
(నిద్దర పోతున్నరా)
(రేపు పొద్దుగాల)
(ఏగు చుక్కవోలే మేల్కొంటరా)

ఈపున మోపోలే కట్టుకున్న తల్లి
ఒళ్లోకి నీవెప్పుడొస్తవో
(ఒళ్లోకి నీవెప్పుడొస్తవో)
రేపు మాపనకుండా యుద్దం చేసే
అమ్మ పాలేప్పుడు నీకు ఇస్తదో
(పాలేప్పుడు నీకు ఇస్తదో)
రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటె
అమ్మ రొమ్మున దిగుతున్నదో
ఆ రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటె
అమ్మ రొమ్మున దిగుతున్నదో
నీ పేగుల్ని మెడకేసుకున్నదో
కాసిం రజ్వీ ని నేనంటున్నదో
నైజాం రాజ్య హింస జరుగుతున్నదో
బిడ్డలారా (బిడ్డలారా)
పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా
నిద్దర పోతున్నరా
రేపు పొద్దుగాల
ఏగు చుక్కవోలే మేల్కొంటరా
(పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)
(నిద్దర పోతున్నరా)
(రేపు పొద్దుగాల)
(ఏగు చుక్కవోలే మేల్కొంటరా)

కాళ్లమీద వేసుకోని గోరెచ్చని
కన్నీటి తానాలు పోతుమా
(కన్నీటి తానాలు పోతుమా)
ఆ వాకిట్లో నిప్పులు రాజేసి
మసి బొగ్గు దిష్టి చుక్కలోలే దిద్దమా
(దిష్టి చుక్కలోలే దిద్దమా)
ఊరంత మీ పాడె మోస్తము
అది ఉగ్గ పట్టుకోని వస్తము
తలకోరు పెట్టేటి బిడ్డలోలే
ముందు నడుసుకుంటా తలుసుకుంటము
తరువాత మిము కలుసుకుంటము
(బిడ్డలారా)
(పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)
(నిద్దర పోతున్నరా)
(రేపు పొద్దుగాల)
(ఏగు చుక్కవోలే మేల్కొంటరా
(పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)
(నిద్దర పోతున్నరా)
(రేపు పొద్దుగాల)
(ఏగు చుక్కవోలే మేల్కొంటరా)

దింపుడు కళ్లంలో మిమ్ములను దింపి
లే బిడ్డా అని అంటున్నము
(లే బిడ్డా అని అంటున్నము)
ముద్దాడి మిమల్ని భూతల్లి
డొక్కల్లో పక్కేసి పడుకోబెడుతున్నము
(పక్కేసి పడుకోబెడుతున్నము)
పిడికిళ్లు మూసిన మీ అరసేతుల్ల
శభదమేందో తెలుసుకున్నము
తెరిసిన కనుగుడ్లు సూపించే తొవ్వల్లో
మేముకూడా దండు కడుతము
వరసగ పబ్బతి పడతము
మీరు వదిలిన బందూకు పడుతము

బిడ్డలారా ఏయ్ బిడ్డలారా
పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా
నిద్దర పోతున్నరా
రేపు పొద్దుగాల
ఏగు చుక్కవోలే మేల్కొంటరా
పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా
నిద్దర పోతున్నరా
రేపు పొద్దుగాల
ఏగు చుక్కవోలే మేల్కొంటరా



Credits
Writer(s): Suddala Ashok Teja, Bheems Ceciroleo
Lyrics powered by www.musixmatch.com

Link