Sirraaku Thaandavam (From " Extra Ordinary Man")

మైసమ్మా మార్చినావే
పొట్టేగాని లెక్కా
మొదటిసారి గిర్రూమంది
కంట్లో నీటి సుక్కా

సెంబులో కుక్కా తలా
ఇరక్క పోయింది
ఎంత పీకిన రానంది
అదిగో అట్టాంటిదే నా పరిస్థితి
బోడి గుండూ తిరపతి
ఎందుకో నాకే ఇట్టా ఆయితాందే ఇది
పాడు పానం అంటిది
అందరూ ఉన్నా లేని అనాదయినది
గ్రహచారం సెడ్డది
యహ మనసు గినసు
దేని కసలు లేనే లేదు విలువ
ఈడ ఎవరికెవరు సొంత మనిషి
లేనే లేరు గురువా
జరిగిందదేదో జరిగి పోయే
ఎందుకింక గొడవా
సెంపలేసి సెప్పుకుంట
నేనే number 1 ఎదవా

ఎన్నడైనా సెదిరి పోని
ఎన్నడైనా సెదిరి పోని
ఎంతో గట్టి మనసు
ఇప్పుడేందో పలిగి పోయే
గాజుకన్నా పెలుసు
పొమ్మన్నాది ఇంటి గడప
రమ్మన్నాది వీధి పడక
ఈ చేదు గుటక దిగక
గొంతుకైనా చమట మరక
మైసమ్మా

సెంబులో కుక్కా తలా
ఇరక్క పోయింది
ఎంత పీకిన రానంది
అదిగో అట్టాంటిదే నా పరిస్థితి
బోడి గుండూ తిరపతి

కొంత మంది జాతకమింతే
By birth-eh खराब-u
ఎందుకంటే తెలియదంతే
దొరకదే జవాబు
ఇది bulb-u లేని switch-u
ఉత్తి బియ్యపు గింజల ఖర్చు
పూర్తి जिंदगी కూర్చోపచ్చు
వాడి కాలమే dirty బిచ్చు
మైసమ్మా మైసమ్మా
Fullగా ఆకూ పరిచి
దావతు పెడితివి
కానీ కక్ష కడితివే
మెల్లగా తినేలోపే నోరూ కుడితివే
నోట్లో మట్టి కొడితివే

ఇది సిర్రాకు సిర్రాకు సిర్రాకు
సిర్రాకు సిర్రాకు తాండవం
ఇది ఎక్కిళ్లు కన్నీళ్ల
నెత్తెక్కి తొక్కే కిర్రాకు తాండవం
ఇది సిర్రాకు సిర్రాకు సిర్రాకు
సిర్రాకు సిర్రాకు తాండవం
ఇది ఎక్కిళ్లు కన్నీళ్ల
నెత్తెక్కి తొక్కే కిర్రాకు తాండవం
ఏ జనక్కి జనక్కి జనక్కి
జనక్కి జనక్కి జాననా
ఏ జనక్కి జనక్కి జనక్కి
జనక్కి జనక్కి జాననా
ఏ జనక్కి జనక్కి జనక్కి
జనక్కి జనక్కి జాననా
ఏ జనక్కి జనక్కి జనక్కి
జనక్కి జనక్కి జాననా



Credits
Writer(s): Saraswati Putra Ramajogayya Sastry, Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link