Samayama

నీసా సానస నీసా సానస నీసా సానస
నీసామా గరిస
నీసా సానస నీసా సానస నీసా సానస
నీసామా

సమయమా
భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా ఒట్టుగా
కనులకే
తన రూపానందిచావే గుట్టుగా
ఓ ఇది సరిపోదా
సరె సరె తొరపడకో
తదుపరి కథ ఎటుకో
ఎటు మరి తన నడకో
చివరికి ఎవరెనకో

సమయమా
భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా ఒట్టుగా
కనులకే
తన రూపానందిచావే గుట్టుగా

ఓ తను ఎవరే నడిచే దారా
తళుకులా ధారా
తను చూస్తుంటే రాదే నిద్దుర
పలికే ఏరా కునుకే ఔరా
అలలై పొంగే అందం
అది తనపేరా

ఆకాశాన్నే తాగేసిందే
తన కన్నుల్లో నీలం
చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం
బంగారు వానల్లో
నిండా ముంచే కాలం
చూస్తామనుకోలేదే నాలాంటోళ్లం
భూగోళాన్నే తిప్పేసే
ఆ బుంగ మూతి వైనం
చూపిస్తుందే తనలో ఇంకో కోణం
చెంగావి చెంపల్లో
చెంగుమంటూ మౌనం
చూస్తూ చూస్తూ తీస్తూవుందే ప్రాణం
తను చేరిన ప్రతి చోటిలా
చాలా చిత్రంగున్నదే
తనతో ఇలా ప్రతి జ్ఞాపకం
చాయాచిత్రం అయినదే

సరె సరె తోరపడకో
తదుపరి కథ ఎటుకో
ఎటు మరి తన నడకో
చివరికి ఎవరెనకో
సమయమా భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా ఒట్టుగా
కనులకే తన రూపానందిచావే గుట్టుగా
ఓ ఇది సరిపోదా సమయమా



Credits
Writer(s): Abdul Wahab Sayyed Hesham, Chegondi Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link