Edhi Edhi (From "Merry Christmas") [Telugu]

ఏది ఏది ఆశించితే
అదే అదే అందేనుగా
ఏది ఏది ఊహించితే
అదే అయ్యేనుగా
ఏది ఏది అనవసరమో
అదే అదే పోయేనుగా
ఏది ఏది అవశ్యమో
అదే వచ్చేనుగా

మనసులోనే ఓ గొంతుకే మోగునే
ఆ గొంతులో మాటలే నమ్మాలిక
మసకలోనే లోలోతులో గీతులే
సూచించిన దారినే వెళ్లాలిగా
అలా అలా అనునిత్యము
అలై అలై సాగాలిలే
అని అని అనుకున్నచో
అన్నీ మన మంచికే

ఇదేంటి అంటూ ఆగకు
ప్రతీ క్షణం ప్రశ్నించకు
జవాబు లేవి చూడకు
విరాహమేమి కోరకు
గతాలలోనే దాగకు
అదే స్వరం స్మరియించకూ
ముగింపులోనే అందము
భరించితేనే బంధము

అలా అలా అనునిత్యము
అలై అలై సాగాలిలే
అని అని అనుకున్నచో
అన్నీ మన మంచికే

కలతలోనే నీ గుండెలో స్థైర్యము
నీ కోసమే సాయము వస్తుందిగా
నిలిచిపోతే నీ చెంతకే తీరము
నీ ముందుకే దూరము రాబోదుగా
చై చై నువ్వే చెయ్యాల్సిందే
నీతో చెయ్యే కలపాల్సిందే



Credits
Writer(s): Pritam Chakraborty, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link