Kanne Adhirindhe

కన్నే అదిరిందే
గుండె సెదిరిందే
పిల్లా నీలో ఏముందో నను లాగుతున్నాదే
మత్తే జల్లావే
మాయే సేసావే
పిల్లా నాలో మంటేసి సలి కాసుకుంటావే

మట్టి తట్ట ఎత్తుకొని
మెట్టు మెట్టు ఎక్కుతున్నా
నిన్ను చూసి ఏదో అయ్యి
వెంటబడి పట్టినానే
ఓ పిల్లా గుండెని గిల్లేసే గారడీ నువ్వే
కొత్త కొత్త మార్పులెన్నెన్నో పుట్టేసినాయే
ఓ రంగు రంగు సొక్కాలేసి
Tip Top అద్దాలు ఎట్టి
రోజు రోజు పనులే మాని
నిన్నే సూస్తూ గడిపేశానే
ఒక్కసారి సూడాలి అంటూ
సుట్టు సుట్టూ తిరిగేశాలే
చిత్తరాలు నాలో రేపి
గుండెకి పండగ తెచ్చేశావే
నీతో నేనే ఇలా ఉండిపోవాలా
కన్నే అదిరిందే
గుండె చెదిరిందే
పిల్లా నీలో ఏముందో నను లాగుతున్నాదే
మత్తే జల్లావే
మాయే సేసావే
పిల్లా నాలో మంటేసి సలి కాసుకుంటావే

ఏ ఏ... పుస్తెలు కట్టి
పున్నమి రేతిరి నీతో ఉన్నట్టు
పిల్లా రోజూ కలొచ్చే
ఏ ఏ... ఇటుక మీద ఇటుక పెట్టి
ఇల్లే కడుతుంటే
పిల్లా మన ఇల్లే గుర్తొచ్చే
జంట నువ్వు అయ్యావంటే
జాతరేలే రేపటి రోజే
బొమ్మలా ఎపుడూ నిన్నే
పిల్లా సక్కగా సూసుకుంటా
నమ్ము అమ్మి నా ఈ మాటే
నువ్వే నాకు అన్నీ ఇంక
ఎంతలేసి కట్టం అయినా
నిన్నే నేను ఒదులుకోనే
నీతో నేనే ఇలా ఉండిపోవాల

కన్నే అదిరిందే
గుండె చెదిరిందే
పిల్లా నీలో ఏముందో నను లాగుతున్నాదే
మత్తే జల్లావే
మాయే సేసావే
పిల్లా నాలో మంటేసి సలి కాసుకుంటావే



Credits
Writer(s): Pavan, Mahesh Poloju
Lyrics powered by www.musixmatch.com

Link